ఆకాశమంత అందమైన బొమ్మ
గులాబి రెమ్మకు పూసింది!!
అద్భుతమైన ఆడ జన్మ
అల్లుకున్న మల్లెతీగ!!
కలువ కళ్ళల్లోనే
కదులుతున్న హృదయం ఉంది!!
జతగా ఉన్న పెదవుల్లా
జత కూడిన పదాల్లేనీ
మౌనంలో ఆమె ఉంది!!?
ఆ అందని అందం
చందమామదే!!
ఎండమావి కాదు
పండువెన్నెల ఒక కన్నకలే ఆ కన్నే!!
గండు తుమ్మెదని కాదు
తీయని తేనె లూరించే తేనెటీగనే
ఎన్నుకున్న పూలవనం
వనమాలి ఆమె!!
పరిమళాల నీటితో
నీలి మేఘాలను కురిపించిన
కురులు అవి!!
పవిత్ర బంధంలో మొలిచిన
ఆ గంధం మొక్కను
గంధర్వులు మలిచిన గానం ఆమె!!
గాలికి వీచే పచ్చని ఆకులు
ఆమెను పిలిచినట్లు
పడమరన సింధూరం సిగ్గు పడింది!!
పచ్చని చిలుకలు పలికినట్లు
చెట్ల పైన ఫలాలన్నీ
గళాలు కలుపుతున్నాయి!!
వింత లోకంలో సొంత మనసులు రెండు
కాలంతో పోటీ పడుతున్నాయి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి