ఓ తెల్లవారుజాము.
భర్త భార్యను లేపి అడిగాడు...
"డియర్...వాకింగుకి పోతున్నా...నువ్వూ వస్తావా?"
భర్త వంక విచిత్రంగా చూసిందా భార్య.
"ఓహో...అంటే నేను లావుగా ఉన్నానని చెప్తున్నారా...అంతేగా? నడిస్తే సన్నబడతావనేగా నన్నూ వాకింగుకి రమ్మంటున్నారు" అడిగింది భార్య.
భర్త : అది కాదమ్మా. వాకింగుకెళ్ళడం ఆరోగ్యానికి మంచిది కదాని.
భార్య : అంటే నేను జబ్బుపడ్డానని అంటున్నారా?
భర్త : అలా కాదే ... నువ్వు రావొద్దులే. ఇంట్లోనే ఉండు.
భార్య : అంటే నేను సోమరిపోతుననేగా మీ ఉద్దేశం.
భర్త : అయ్యో...నేనలా అనలేదే. నేనేదన్నా తప్పుగానే అర్థం చేసుకుంటావేంటీ?
భార్య : అంటే ఇంతకాలమూ నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదా?
భర్త : మళ్ళా ఏదో ఒకటంటావు...నేనలా అనలేదే నిన్ను.
భార్య : అలాగే అన్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నాననేగా.
భర్త : దయచేసి నన్నొదులు. పొద్దుపొద్దున్నే ఏమిటీ గొడవా?
భార్య : అవునండీ ....నేను తగవులమారినే
భర్త : ఓకే. నేనూ పోలేదులే వాకింగుకి. చాలా...?
భార్య : మీకు వెళ్ళడానికి విసుగు. అందుకు నన్నేదో ఒకటి అనాలి. అంతే కదండీ. అనండి.
భర్త : సరే కానీ. నువ్వు పడుకో. నేను ఒంటరిగానే వెళ్తానులే.
భార్య : అదేగా మీక్కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. నేను పక్కనుంటే మీకెక్కడిది ఆనందం? అందుకేగా ఇన్ని మాటలు. వెళ్ళిరండి ...నాలుగూ చూసిరండీ...
ఇలా సాగిన వీరి మాటల యుద్ధంతో తెల్లవారిపోయింది. ఇక ఆయనగారి వాకింగ్ ఎక్కడిది? ఆ భర్తగారు తయారై ఆఫీసుకి వెళ్ళడం తప్ప....

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి