తోటమాలి! అచ్యుతుని రాజ్యశ్రీ

 తోటమాలి రాముడు సీదాసాదా మనిషి. తను తనపని తప్ప వేరే ఏమీ పట్టించుకునేవాడుకాదు.రకరకాల  మొక్కలు చెట్లను సాకుతూ అవిఇచ్చే పళ్ళు పూలు అమ్ముతూ సంసారం ని పొదుపుగా నడుపుతున్నాడు.ఉన్న ఇద్దరు కొడుకులు  సోంబేరులు.అచ్చోసిన ఆంబోతుల్లా తయారైనారు.ఓసారి కొడుకులతో అన్నాడు "నేను యాదాద్రి కి పోయి ఓనెల ఉండివస్తా.మీరు ఇంటివ్యవహారాలు చూసుకోండి. ""నాన్న! ఆతోటపని మావల్ల కాదు. తోటని అమ్మేసి ఆవచ్చిన డబ్బు తో బతుకుతాం"."ఒరేయ్!మీకన్నా ఈతోట నాకు ముఖ్యం!నాతండ్రి లా నన్ను సాకింది.మీకన్నా మిన్నగా దీన్ని ప్రేమించాను .నాబిడ్డలాంటి తోటను అమ్మితే ఎలా?" "మరి ఏంచేయమంటావు నాన్నా?""ఎండిన చెట్లు కొమ్మలు కొట్టేసి ఆకట్టెలు అమ్మండి.ఆడబ్బు తో కూరలు కొని అమ్మండి." అంతే తండ్రి చెప్పి నట్లు కొడుకులు ఎండినవి కొట్టినందుకే ఒళ్లు అంతా చెమటతో తడిసి ముద్ద ఐంది. "మీ చెమటబిందువులు  ముత్యాలు గా మారుతాయి రా! మన శరీరం ఖజానా! చెమటముత్యాలు ఆధనాగారంలో ఎప్పుడూ ఉండాలి. కష్టే ఫలీ!" "నాన్నా! నీవింక నిశ్చింతగా యాత్ర కి వెళ్లు."వారికె రెండు మంచి జామపండ్లు ఇచ్చి"ఇవి నాచేతిలో పెరిగిన చెట్టుకాయలు.చెట్టుని కొట్టేస్తారు మీరు.పాపం దాని బాధ నాకే తెలుసు."అన్న తండ్రి మాటలువింటూ దానిలోని మర్మం అర్ధం చేసుకున్నారు ఇద్దరూ!"నాన్నా!మేము  చెట్లను కొట్టివేయం! చెట్లను పెంచటంలో మాచెమటచుక్కల్ని రాలుస్తాము.కొత్త మొక్కలు నాటుతాం! తోటను అమ్మకానికి పెట్టం.తండ్రి లాంటి తోటను పచ్చగా కళకళలాడుతూ ఉండేలా చూస్తాం. ""ఇదేమీలో నేను కోరుకున్న మార్పు!తోటమాలి పని చెట్లను పెంచి పోషించడం! వాటిని మీచెమటతో పోషించండి.మీచెమట చుక్కల్ని ముత్యాలుగా మార్చండి.చెట్లను కొట్టి అమ్మితే అవి బూడిద గా మారుతాయి. మనిషి అశాశ్వతం.ప్రకృతి శాశ్వతం "🌹
కామెంట్‌లు