చరిత్ర మరుగున మహిళలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 ది క్వీన్ మదర్ మహారాణి జింద్ కౌర్  లాహోర్ కి చెందిన ఆఖరి రాణి.మహారాజా రణజిత్ సింహ్ ఆఖరి భార్య!1817లో సియాల్ కోటలో పుట్టింది. 1835లో రణజిత్ తో పెళ్లి ఆపై దిలీప్ సింహ్ పుట్టుక వరకు ఆమె జీవితం సాఫీగా సాగింది. 1845లో తొలి సిక్కు ఆంగ్లో యుద్ధం తో ఆమె ఓదాసీవేషంలో బ్రిటిష్ వారి నుంచి తప్పించుకుంది కానీ కొడుకు ఆంగ్లేయుల చేతికి చిక్కాడు.9ఏళ్ళ ఆబాలుడిని క్వీన్ విక్టోరియా పెంపకంలో ఉంచి బ్లాక్ ప్రిన్స్ అని పిలిచేవారు.వితంతువైన కౌర్ తనకొడుకుని కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి11ఏళ్లు నేపాల్ లో తలదాచుకుంది. ఎన్నో లేఖలు రాసిన ఆమెకు ఎలాగైతేనేం ఆఖరి ఘడియల్లో కొడుకు ని కలిసి 1863 లో తుదిశ్వాస విడిచింది ఇంగ్లాండ్ లో! మహారాజా దిలీప్ సింహ్ తల్లి అంతిమ సంస్కారం పంజాబ్ లో చేద్దామనుకున్నాడు.కానీ బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. ఇదీ నిస్సహాయంగా మిగిలిన ఓతల్లి  గాథ!
ఆంగ్లేయుల డిటెక్టివ్ గా పనిచేసిన నూర్ ఇనాయత్  టిప్పు సుల్తాన్  వంశంకి చెందిన వనిత!1914లో మాస్కోలో పుట్టింది. తల్లి అమెరికన్.తండ్రి భారతీయుడు.1943లో బ్రిటిష్ సేనలో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసింది.బ్రిటన్ లో ఆమె కుటుంబం స్థిరపడింది. ఫ్రెంచ్ భాషను అనర్గళంగా మాట్లాడే ఈమెనుగూర్చి  ప్రధాని చర్చిల్ కి తెలిసింది. అలా తొలుత ఏర్ఫోర్స్ మహిళా యూనిట్ లోచేరి నాజీల చేతచిక్కి 30వ ఏట వారిచే కాల్చి చంపబడింది. "ది స్పైప్రిన్సెస్-దిలైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్"లో ఆమె జీవితం గూర్చి విపులంగా రాయబడింది. 
భారత దేశంకి తొలి ఆస్కార్ అవార్డ్ ని తెచ్చిన ఘనత భానూ అథైయాకి చెందుతుంది. 1982లో గాంధీ సినిమాలో  కాస్ట్యూమ్స్ డిజైనింగ్ లో ఈమె కి అవార్డు లభించింది. 100మంది నటులకు ఆసినిమాలో పనిచేసింది. 1929లో కొల్హాపూర్ లో పుట్టిన ఈమె1956లో సినిమా రంగప్రవేశం చేసింది. రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న ఆమె తన ఆస్కార్ అవార్డ్ భద్రత కోసం 2012లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్  ఆర్ట్స్ అండ్ సైన్సు కి వాపసుఇచ్చారు.ఆమె చేసిన సినిమాలు 100పైగా ఉన్నా గైడ్ లగాన్ సత్యం శివం సుందరం ముఖ్యమైనవి. 2020లో ఆమె తుదిశ్వాస విడిచారు.
2018లో గ్రాడ్యుయేట్ ఐన ఇద్దరు పిల్లల తల్లి జోధపుర్ రోడ్లు ఊడ్చే పని చేపట్టింది. పెళ్ళి ఐన 5ఏళ్లకే భర్త విడిచి పెట్టాడు.32ఏళ్ల ఆశా కండారా ధైర్యం గా నిలబడి ఐ.ఎ.ఎస్.కి  తయారు అయింది. 2021లో ఆమె కృషి ఫలించి ప్రస్తుతం రాజస్థాన్ లో డిప్యూటీ కలెక్టరు గా చరిత్ర సృష్టించింది.నిజంగా  ఇలాంటి వనితలు ఆదర్శ తల్లులుగా అధికారిణులుగా మనకు స్ఫూర్తి ప్రదాతలు 🌷

కామెంట్‌లు