కొన్ని కష్టంతో వస్తాయి
కొన్ని ఇష్టంతో వస్తావీ
కొన్ని యాదృచ్ఛికంగా వస్తాయి
కొన్ని తెలివితేటలతో వస్తావీ!!
అన్ని చెమటతో
శ్రమతో రావాలని ఏమీ లేదు!?
అన్ని తెలివితేటలతోనే
రావాలని ఏమీ లేదు!!?
కొన్ని పుట్టుకతో వస్తాయి
కొన్ని యాదృచ్ఛికంగా వస్తాయి!!
ప్రణాళికతో ప్రాణం పుట్టలేదు
సూత్రాలతో విశ్వం పుట్టలేదు
పుట్టినంక తెలిసింది సూత్రమేదో!!?
ఏదైనా పొందాలంటే
ముందుగానే నిర్ణయించబడాలని ఏమీ లేదు
అనుకోకుండా పొందవచ్చు!!?
అవసరాలు పుట్టినట్లు
అవకాశాలు పుడతాయి!
అవకాశాలు పుట్టినట్లు
అదృష్టాలు పుట్టవచ్చు!!
ప్రతిదీ శ్రమతో చెమటతోనే
పొందాలని ఏమీ లేదు!
ప్రతిదీ తెలివితేటలతోనే
పొందాలని ఏమీ లేదు!!?
కాలమే నిర్ణయించబడలేదు
పొందాల్సిన దాన్ని
కాలమెట్ల నిర్ణయిస్తుంది!!?
మీ దారిలో నీకు దొరికేది
ఎంత దూరంలోనైనా ఉండవచ్చు
దొరికి తీరుతుంది!!
దానికి ఆప్షన్ లేదు ఛాయిస్ లేదు
అవసరము లేదు!!
నీ ఉనికి కి అద్దె వసూలు చేసే వన్నీ
అబద్ధాలే!!!?
యుద్ధం చేయాల్సిన అవసరం లేదు
వందేళ్ళ మాంసపు ముద్దలం మనం!!
నిశ్శబ్దంగా ఉందాం
విశ్వం విచిత్రం
చలనచిత్రం చూద్దాం!!?
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని
బాలలు శ్రీహరి మరియు శివాని లకు అంకితం.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి