1946వ సంవత్సరం ప్రాంతంలో సత్యనారాయణ గారి ఇంట్లో భాస్కర్ తండ్రి నాగులపల్లి సీతారామయ్య గారు మరి కొందరు కలిసి మహర్షి మహావిద్యాలయం అనే పేరుతో దాన్ని ఒక పాఠశాలగా రూపుదిద్దారు. తర్వాత సీతారామయ్య గారు మద్రాసు వెళ్లి మిడిల్ స్కూల్ గాను 49- 50లో హైస్కూల్ గాను అనుమతులు తెచ్చారు 55 లో భాస్కర్ ఎస్.ఎస్ ఎల్.సి అక్కడే చదివి మంచి మార్పులతో పాసయ్యారు తర్వాత ఈ ముద్దనూరు గ్రామ చరిత్ర మిగిలిన గ్రామ వాసులకు కూడా తెలియజేసి వారు కూడా వారి గ్రామాల గురించి మరింతగా కృషిచేసి వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో చక్కటి పుస్తకంగా ఆ గ్రామము గురించి పుస్తకాలు రావాలని ఎంతో ఆకాంక్షిస్తూ గ్రామాలు గర్వించేలా ఉండాలిగా మా ఊరే ఒక ఉదాహరణ అన్న మకుటంతో గ్రంథాన్ని విడుదల చేశారు. ఒక గ్రంథాన్ని రచించాలంటే మాటలతో పని కాదు. ఎంతో కృషి, పట్టుదల ఉండి అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకుని దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా రాసుకుని తరువాత రచనకు ఉపక్రమించాలి. నేను కూడా మా తేలప్రోలు గ్రామ చరిత్ర ప్రచురించాను కానీ ఇంత సమగ్రంగా లేదు అని ఇది చదివిన తర్వాత తెలిసింది కారణం ముదునూరుతో పాటు ఆ పరిసర ప్రాంతాల పరిస్థితులను చెప్పి భారతదేశంలో ఉన్న పల్లెల పరిస్థితి మొత్తాన్ని వివరించడం ఈ పుస్తకానికి వన్నె తెచ్చింది ప్రత్యేకించి అనేక ఛాయాచిత్రాలను సేకరించడం అనేది ఒక బృహత్కార్యం దానిని యజ్ఞం లాగా భావించి చేశాడు కనుకనే భాస్కర్ కృతకృత్యుడయ్యాడు. మా ఊరే ఒక ఉదాహరణ అనడానికి బదులుగా మా భాస్కర్ రచనే ఉదాహరణ అని నేను ఈ పుస్తక రచనను గురించి చెప్పడానికి సాహసిస్తున్నాను. తప్పోఒప్పో ఆ గ్రంథాన్ని చదివి మీరు నిర్ణయించండి.
ఇన్ని సంవత్సరాల సహచర్యంలో భాస్కర్ ఎప్పుడు ఎదుటివారిని తూలనాడటం కానీ పరుషంగా మాట్లాడటం కానీ నేను వినలేదు యవ్వనంలో ఉద్రేకంలో ఉన్న వయసు నుంచి ఈ క్షణం వరకు తాను నాకు చాలా దగ్గర స్నేహితుడు. నాపై తనకు స్వతంత్రం ఉంది అలాంటివాడు కాకాని వెంకటరత్నం గారిని గురించి వ్రాస్తూ ఒక వాక్యంలో విద్యాశాఖ మంత్రి అని వాడాను దాన్ని చదివిన తర్వాత భాస్కర్ ఆనంద్ జీ అక్కడేదో తప్పు పడినట్టుగా ఉంది ఆయన ఎప్పుడూ విద్యాశాఖ మంత్రిగా లేరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను చేపట్టి దిగ్విజయంగా రైతులకు సహకారిగా ఉన్నారు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నారు తప్ప పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు అది తన సాత్వికతకు నిదర్శనమే కానీ దాని మూలం తల్లితండ్రులు సీతారామయ్య గారు, సోమి దేవమ్మ గారు ముఖ్య కారకులు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మిగిలిన గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే అప్పుడు భాస్కర్ ఆశయం నెరవేరుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి