స్వార్ధ పరుడె.. సెల్ఫిష్;-శంకర ప్రియ., శీల.,--సంచార వాణి: 99127 67098
 👌"నేను నాదీ" యనెడు
హ్రస్వ దృష్టి కలిగిన
      స్వార్ధ పరుడె.. "సెల్పిష్"!
ఆత్మ బంధువు లార!
👌ధార్తరాష్టుడు నైన
సుయోధనుడె.. సెల్పిష్!
       ఫిష్షు కానీ.. పిష్షు!
ఆత్మ బంధువులార!
👌"సెల్పిష్" అనగా, మిక్కిలి స్వార్ధ పరుడు! స్వోత్కర్ష కలవాడు! అనగా, తనను తాను ప్రశంసించు కొనువాడు! తనగురించి, కుటుంబము గురించి ఆలోచించు వాడు! "తన కడుపే.. కైలాసం" అని, హ్రస్వ దృష్టితో వ్యవహరించువాడే.. సెల్పిష్!
👌స్వార్ధపరునకు నకు సరియైన ఉదాహరణ.. మహాభారత గాథలో..  దుర్యోధనుడు! అతడు..  అంధుడైన, ధృతరాష్ట మహారాజు యొక్క నూరుగురు కుమారులలో మొదటివాడు! పైకి ఏ బాంధవ్యాన్ని చూపినా, లోపల ప్రతిఫలం.. తనకు మాత్రమే దక్కాలి! అనుకుంటాడు! తన అవసరార్ధం, అందరినీ "బలిపశువు"లుగా  వాడుకోవడం; పైకి కనబడకుండా అతితెలివి తేటలు ప్రదర్శించడం.. "సెల్పిష్ నిజస్వభావము!
 👌తల్లి చేప.. పిల్లచేప సంభాషణ వినండి:
     ఒకరోజు పిల్ల చేప,
తల్లి చేపను.. "ఎందు కమ్మా! మనం భూమ్మీద బతకలేం" అని అడిగింది! అప్పుడు తల్లి చేప  "ఈభూమి మీద సెల్ఫిష్ (selfish) లకే తప్ప... మనలాంటి ఫిష్ (Fish) లకు చోటు లేదమ్మా!" అని, బదులు పలికింది! అందువలన,  "సెల్పిష్"ల విషయములో, కడు జాగ్రత్తగా మెలగండి!
🚩తేట గీతి పద్యము🚩
    కొలను నందు ఫిష్షొక్కటి కోర్కెతోడ
    తల్లి నడిగె! "ఏల మనము ధరణి పైన
    బ్రతుక లేమన?" నట, తల్లి బలికె నిటుల
     ఫిష్షులకు లేదు చోటు, "సెల్ఫిష్షు లకునె!"
( రచన: "సాహితీ బంధు" తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ. )

కామెంట్‌లు