* అన్నీ నేనే - అంతా నేనే *;- కోరాడ నరసింహా రావు
అహం... నేను... !
            సో హం.... అదేనెను !
త్వమేవాహం...నీవుకూడా నేనే
 అహం బ్రహ్మ... అహం విష్ణు 
    అహమేవ మహేశ్వరః... !
   వేదోపనిషద్వాక్యములివి... !!

ఇంకా సునిశితంగా ఆలోచించు
 అహంవినా కించిత్ నాష్టివిశ్వం
 అనే కాదు.,కేవలమహం జగత్
 సర్వం...అని కూడాఅనగలుగు తావ్.....!

ఈ సృష్ఠి సమస్తమూ... నేనై... 
  నిండియున్నది... !
ఆత్మవత్  సర్వభూతాని... !   
నేను...నేను  అంటున్నది..అది
అదే * ఆత్మ *.. !!
  నీ వెవరు.... ?
పంచ జ్ఞానేంద్రియాలా....
 నాకన్ను, నాముక్కు, నాచెవి, నాచర్మం, చివరికి నాదేహం 
అంటున్నావు కదా... అంటే... 
 అవేవీ నువ్వుకావన్నమాటేగా 
  నామనసు, నాబుద్ధి,నాప్రాణం
అంటున్నావంటే...ఇవేవీ కూడా
నీవు కావు కదా.... !!

వీటన్నిటికీ అతీతమై... 
   ఈ కార్య కలాపాలన్నిటికీ... 
      సాక్షీ భూతమై.... 
      ప్రవర్తిస్తున్నదొకటి మిగిలి     ఉందిగా.... అదే నోయ్ నీవు !
  ఇంకా బోధపడలేదా... 
   అదేనోయ్  ఆత్మ.... !
అది నీలో ... నాలో... సకల ప్రాణికోటిలోనూ కొలువై వుంది!

అందుకేరమణమహర్షిఅంటారు
ఏదో...తెలిసుకోవాలనితపించకు...నిన్ను నువ్వు తెలుసుకో... 
 అంటారు !
సృష్ఠి సమస్తమూ నీలోనే ఉంది 
నీలో ఏదైనా లేదుఅనినువ్వను 
కుంటే ఈ ప్రపంచంలో ఎక్కడ వెదకినా అది ఉండదు !
   ఇది సత్యము ! అన్నీ నీవే... 
అంతా నీవే అయినప్పుడు... 
 ఇంక భేదాలకు, వాదాలకూ 
ఖేదాలకు తావెక్కడుంటుంది !! 
ఇదే సత్యము - శివము -సుంద రము...!
    అంతా  ఆనందమయం !!
         ******

కామెంట్‌లు