తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపిల్లాడు బడికి పోనంటే పోను అని మొండి కేశాడు కానీ తన 19వ ఏట
ఓకవితా సంకలాన్ని వెలువరించాడు.వేలాది గేయాలు 200పుస్తకాలు కథలు వ్యాసాలు ఏకాంకిక నాటకాలు రాశాడు.తన కలంతూటాతో రజాకార్లను కుళ్ళబొడిచాడు.ఆయువకుడే హరీంద్రనాధ్ చటోపాధ్యాయ సరోజినీ నాయుడు తమ్ముడు.
మన హైదరాబాద్ లో పుట్టిన ఈయన నైజాం నవాబు కి చెమటలు పట్టించాడు.ఆరుద్ర ఆయన గేయాలను అనువదించారు.హరీంద్ర హిందీ బెంగాలీ సినిమా లలో నటించాడు.ఆశీర్వాద్ చిత్రం లో ఆయన పాట చుక్ చుక్ గాడీ పిల్లలని బాగా ఆకట్టుకుంది.జూలీ సినిమాలోమైహార్ట్ ఈజ్ బీటింగ్ ను హేమంత కుమార్ పాడటంతో హిట్ ఐంది ఆసినిమా!"నారక్తాన్ని కలంలో ముంచి ప్రజలకోసం పాటలు రాస్తాను" అన్నాడు.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ లెక్క తప్పుచేసిన మాష్టారు తో"సార్! మీరు చేసింది తప్పు" అని తను బోర్డు మీద చేసిచూపి ఎంచక్కా కుర్చీలో బైఠాయించారు.పేదరైతు కుటుంబంలో పుట్టిన ఈయన 18 ఏళ్ల వయసులో తండ్రి అన్న తో కల్సి పొలం పనులు చేసేవాడు.గాంధీజీ సర్దార్ అని పిలవడంతో అదే స్థిరపడింది.తల్లి సోదరుడు చనిపోయినప్పుడు జైల్లో ఉన్నారు.కండిషన్ బెయిల్ పై బైటికి రావడానికి ఒప్పుకోలేదు.
మతకలహాలు చెలరేగినప్పుడు వేలాది ముస్లిం కుటుంబాలకు అర్ధరాత్రి ఎర్రకోట లో ఆశ్రయం కల్పించారు.
కామెంట్‌లు