ధర్మో రక్షతి రక్షితః; -: సి.హెచ్.ప్రతాప్
 ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌
అని మనుస్మృతిలో చెప్పబడింది. దీని ప్రకారం ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం. చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;
రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;
కనునుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి అన్న ఈ భావార్ధాన్ని ప్రతీ ఒక్కరం మనస్సులో నిక్షిప్తం చేసుకొని ఆచరించేందుకు శతవిధాలా కృషి చెయ్యాలి.
ధర్మం మానవ జీవితాన్ని నియమపూర్వ కంగా ముందుకు నడిపిస్తుంది. మానవులంతా కలిసి మెలిసి ఉండాలని ఉద్బోధిస్తుంది. సహనాన్ని నేర్పు తుంది. సంయమాన్ని అలవరచుకొమ్మంటు ంది. వైరుధ్యంతో కూడిన విశ్వాసాలను, భావా లను అధిగ మించాలని చెబుతుంది. సామరస్య పూర్వ కంగా ఐక్య తను సాధించుకొమ్మంటుంది. పర ధర్మం లేదా పర మతంలో ఉండే విశిష్టతలను స్వీకరించమని చెబు తుంది. పొరపాటు చేసిన వాళ్లను మన్నించమని చెబుతుంది.
సృష్టిలో అత్యంత మధురమైనది మాతాపితల ధర్మం. దానికంటే మధు రాతి మధురమైనది దైవధర్మం. ఆ విధంగా తల్లిదండ్రుల్లో దైవ ధర్మాన్ని చూడాలి. దేవుడిలో తల్లిదండ్రుల్ని దర్శించాలి. ఎందుకంటే తల్లిదండ్రులూ దైవమూ వేర్వేరు కాదు. దైవం ఎక్కడో లేడు మనంచేసే ధర్మంలోనే ఉన్నాడు. అంతటా అందరిలోనూ లోకధర్మంలో ఉన్నాడు. ధర్మ స్వరూపుడైన దైవం అంతర్యామియై ఉన్నాడు.

కామెంట్‌లు