మనకు తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి ఉండాలి. అప్పుడే రాణిస్తాం.టీచర్ ఓకథ చెప్పింది " ఓరాజు తన సభలో వారికీ మూడు ప్రశ్నలను ఇచ్చి జవాబు చెప్పమన్నాడు.1 .ప్రపంచం దేనిపై ఆధారపడి ఉంది?2సంతానం పుత్రులు లేని వారికి సద్గతి ఎలాకలుగుతుంది?3 ఉంగరంలోపలినుంచి నీవు దూరి ఎలాబైటకి రాగలవు? పిల్లలూ!మీరు ప్రయత్నించండి"
పిల్లలు అంతా తెల్లమొహాలు వేశారు. శివా లేచి" టీచర్!ఈకథని మా అమ్మమ్మ చెప్పింది.మొదటిప్రశ్నకి జవాబు ప్రపంచం సత్యంపై ఆధారపడి ఉంటుంది. సంతానం పుత్రులతో సద్గతి కలగదు.అది శుద్ధ తప్పు. మనం చేసే పాప పుణ్యాలే మనవెంట వస్తాయి. అదే సద్గతి కలిగిస్తుంది. "తనపేరు కాగితం పై రాసి శివా " టీచర్!మీవేలి ఉంగరం బైట కి తీయండి " అని ఆకాగితంని ఉంగరం లో పెట్టి అవతలివైపు నించి బైటికి తీశాడు. క్లాస్ అంతా చప్పట్లతో మార్మోగింది. పెద్దల దగ్గర కథలు వినాలి.స్వయంగా పుస్తకాలు చదవాలి అని టీచర్ వారికి చెప్పింది. 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి