చాతకం! అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ పాఠం చెప్తూ చాతకపక్షిగూర్చి వివరించింది.ఆపక్షి ఎట్టిపరిస్థితులలోనూ నేలపై పడిన నీరు తాగదు.వర్షపు నీటిచుక్కలకై నోరు తెరిచి కూచుంటుంది.అలాగే మనంకూడా మన మంచి అలవాట్లు వదలరాదు.ఆరోజు బడికి వెళ్తూ శివా ఇదే ఆలోచిస్తున్నాడు.ఇంతలోఒక వ్యక్తి సైకిల్ వెనకాల చిన్న చిన్న మూటలు పెట్టి వెళ్లుతున్నాడు.బక్కగా ఉన్న అతను అతి కష్టం పై తొక్కుతున్నాడు.రోడ్ అంతా ఎగుడుదిగుడుగా ఉంది. సైకిల్ వెనకాల ఉన్న కూరలమూట కింద పడింది. అతను అది గమనించలేదు. రోడ్ పై పోతున్న వారు కనీసం అతన్ని పిలిచే ప్రయత్నమే చేయలేదు.బడిలో ఫస్ట్ పీరియడ్ లెక్కల పరీక్ష.ఆలస్యంగా వెళ్లితే బైట నించోపెడతారు.ఐనా శివా "అంకుల్!బాబాయ్!కూరలమూట జారి కింద పడింది. ఆగండి " అని అరుస్తూ దాన్ని తీసుకుని పరుగులు పెట్టాడు. ఖంగారులోసైకిల్ అదుపుతప్పి ఆవ్యక్తి కింద పడ్డాడు. శివా గబగబా పరుగెత్తి  అతన్ని లేపాడు.కాళ్ళు చేతులు గీరుకుపోయాయి అతనికి. తన చేతి దస్తీతో తుడిచి తన దగ్గర ఉన్న బాటిల్ లోని మంచి నీరు తాగించాడు."బాబూ!నేను సైకిల్ తొక్కలేను.కాస్త మాఇంటి ముందు దింపు" దీనంగా అడిగాడు. ఇంకోరి సాయంతో  సైకిల్ వెనకాల అతన్ని కూచోపెట్టి నెమ్మదిగా తొక్కుతూ ఆగల్లీ చివర ఉన్న అతని ఇంట్లో దింపాడు.ఇదంతా అయ్యేటప్పటికి ఫస్ట్ పీరియడ్ పరీక్ష ఐపోయింది.జరిగింది అంతా హెచ్.ఎం.కి చెప్పితే ఆయన శివా ని మెచ్చుకుంటూ "పరీక్షమళ్లీ రాయవచ్చు. కానీ ఓమనిషికి సాయం చేశావు.నీపరోపకారబుద్ధి మెచ్చతగింది" అని కొత్త పెన్ను తనజేబులోంచి తీసి శివా కి ఇచ్చారు 🌹
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం