*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0221)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శంభుడు తన దివ్యరూపమును ప్రకటము చేయడం - మేనకా దేవి ఆనందించి క్షమను యాచించుట - పురవాసినులు శివుని కన్నలారా చూచి ధన్యులము అయ్యాము అని తలచుట.
*నారదా! విష్ణుమూర్తి మాటలతో శాశ్వతముగా తన మనసు మరల్చుకుని శంభుడు సుందరేశ్వరుడుగా వస్తే కాళిని ఇచ్చి వివాహము చేస్తాను అని చెప్పిన మేనక మాటలు విన్న విష్ణుమూర్తి చెప్పగా నీవు భగవంతుడు అగు శంకరుని దగ్గరకు వెళ్ళావు. అనేక విధాలుగా నీలకంఠుని భజన చేసి, కీర్తన చేసావు. నీ కీర్తనల చేత ప్రసన్నుడై శంభుడు తన రుద్ర రూపమును చాలించి, అద్భుతమైన, దివ్యమైన, భవ్య సుందర రూపాన్ని ధరించారు. తనను నమ్మికగా కొలిచేవారి పట్ల పరమేశ్వరుడు తన దయా వృష్టి కురిపిస్తూ ఉంటారు. ఇప్పుడు నీవు సకల శివ పార్షదులు వెంటరాగా సదాశివ సుందరేశునితో కలసి మేనకా దేవి మందిరమునకు వెళ్ళి, "విశాలనేత్రీ! మేనకా! నిన్ను అనుగ్రహించి శంకరుడు నీవు కోరినట్లు సుందరరూపంలో నీ యింటికి పార్వతిని అడుగడానికి వచ్చారు" చూడు అని చెప్పావు.*
*నీ మాటలు విన్న మేనక వృషభేశ్వరుడు ఉన్న వైపు చూచి ఆనంద పరవశురాలు అయ్యింది. ఆ స్వామి రూపం, అత్యంత సుందరుడైన మదనుని రూపం కంటే అతి సుందరంగా ఉంది. ఆ స్వామి అత్యంత విచిత్ర వస్త్రాలు ధరించి, సుశోభితుడై, లావణ్యంగా మనోహరంగా గౌరవర్ణుడుగా కనిపిస్తున్నారు. సూర్యుడు గొడుగు పడుతున్నాడు. గంగా యమునలు చామరాలు వీస్తున్నారు. చంద్రుడు రేఖగా ఉన్నాడు. అష్టసిద్ధులు స్వామి ఎదుట నాట్యం చేస్తున్నారు. తుంబురులు మొదలైన వారు సంగీత వాద్య గోష్ఠి చేస్తున్నారు. మిగిలిన దేవతలు, శివ పార్షదులు అందరూ కూడా తమ ధర్మపత్నులతో కలసి బహు చక్కగా అలంకరణ చేసుకుని ఉత్సవం లా వస్తున్నారు. గంధర్వులు అప్సరసలతో కలసి శంకరుని కీర్తిస్తున్నారు. దేవతా సమూహమంతా శివా శివుల కళ్యాణం చూడాలి అని ఎంతో ఉత్సుకతతో ఉన్నారు.*
*ఇంత అట్టహాసంగా, పరిజనులతో పరివృతమై వచ్చిన అతి సుందర ఈశ్వరుని చూచిన మేనక ఎదురు వెళ్ళి, "మహేశ్వరా! మా కూతురు పార్వతి చాలా గొప్ప తపస్సు చేసి నిన్ను పతిగా వరం పొందింది. కానీ, నేను నీ మాయలు తెలుసుకోలేక అనరాని మాటలు ఎన్నెన్నో అన్నాను. అయినా, నా యందు కృపతో నన్ను కరుణించి నా కోరిక మేరకు రుద్ర రూపము వదలి, సుందరేశ్వరుడుగా వచ్చారు మీరు. నా జన్మము, నా పుట్టింటి వంశము, నేను మెట్టిన ఇంటి వంశము, మా కూతురు కాళీ మా అందరి పుణ్యఫలము పండింది. మేమందరం ధన్యచరుతులము అయ్యాము. ఇంతకుముందు నేను చేసిన దాషణలను పూర్తిగా మన్నించి, మమ్ము ఆనందింప చేయి పరమేశ్వర. ఇప్పుడు మీ ఇరువురి వివాహానికి నాకు ఎటువంటి అభ్యంతము లేదు" అని చెప్పింది మేనక.*
*ఇలా తరలి వచ్చిన నిశచరపతిని చూడడానికి హిమాచల నగరంలోని పిల్లా పాప, పిన్న పెద్ద, యుక్తవయసు కన్యలు, ముత్తైదువులు అందరూ మేనకా దేవి మందిరానికి వచ్చారు. చేస్తున్న పనులు కూడా ఎక్కడివక్కడ వదిలేసి, మళ్ళీ ఆ సుందర మూర్తి దర్శనం కరువైపోతుందేమో అని పరుగు పరుగున వచ్చారు. శివా శివుల వివాహము ద్వారా తమ కోరికలు అన్నీ కూడా తీరుతాయి అని మనస్ఫూర్తిగా నమ్మి ఉన్నారు. ఇలా ఆనందంగా ఉన్న ఆ ముత్తైదువులు అందరూ, స్వామికి చందనాక్షతలతో పూజ చేసారు. ముత్తైదువుల నోటి నుండి శుభవచనములను విని విష్ణ్వాది దేవతలతో సహా భగవంతుడు అయిన శివుడు మిగుల హర్షించెను.*
*అయ్యలారా! పరమేశ్వర భంధుజనులారా! ఈ విధంగా శివపార్వతుల కళ్యాణానికి వచ్చిన అన్ని అడ్డంకులు తొలగిపోయి, శివా శివుల కల్యాణం లో వరపూజ ఘట్టము మొదలవబోతోంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం