బందా గారు చారిత్రక నాటకాన్ని ప్రసారం చేద్దామన్న అభిప్రాయంతో గోల్కొండ ముట్టడి నాటకాన్ని వ్రాయించి తెప్పించారు. నన్ను పిలిచి నాటకం చేయగలవా ఇందులో కందుకూరి చిరంజీవిరావు మాచినేని వెంకటేశ్వరరావు కర్నాటి లక్ష్మీ నరసయ్య కాబూలీ వాలా రామచంద్ర రావు, పూర్ణిమ లాంటి పెద్దవాళ్లంతా నటిస్తున్నారు భయం లేకుండా చేయగలవా అంటే మీరు ఉండగా నాకు భయమా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మీరు ఏ వేషం ఇస్తే ఆ వేషం చేస్తాను కర్ణాట లక్ష్మీ నర్సయ్య గారు నాకు కొత్త కాదు నేను కథానాయకుడు వేసిన ఛైర్మన్ నాటకంలో ఆయన ప్రతి నాయకుడు. మాచినేని వెంకటేశ్వరరావు గారు నేను నటించిన నాటకాలకు దర్శకత్వ బాధ్యత వహించే వారు. వేదికల పైన చిరంజీవి రావు గారు మనతో ఇక్కడ ఉన్న వారే కనుక నన్ను పుత్ర సామానుడిగా చూస్తారు. మీరు చెప్పిన వీరిలో నాకు పూర్ణిమ గారి పేరు కొత్తగా ఉంది. ఆవిడను నేను చూడను కూడా చూడలేదు అన్నాను.
పూర్ణిమ గారు చాలా మంచి నటి నా నాటకాలు రంగస్థలం మీద అద్భుతంగా నటించేది అందుకోసం ప్రత్యేకించి ఈ నాటకం కోసం పిలిపించాను తను కూడా మనతో పాటు కుటుంబ సభ్యులగానే ఉంటుంది అని చెప్పగానే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మొదటిరోజు కొంచెం బిడియంగా కొత్త కొత్తగా అనిపించింది రెండో రోజు సాధన చేస్తున్న సమయంలో నన్ను సొంత బిడ్డగా ఆప్యాయంగా చేయమని చెప్పారు పూర్ణిమ గారు. రామచంద్రరావు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన కాబూలీ వాలా నాటకాన్ని ప్రదర్శించేవాడు. కనుకనే అతన్ని కాబూలీ వాలా రామచంద్రరావు అని పిలుస్తారు రెండవ రోజు నాటకం పూర్తయిన తర్వాత మాకన్నా నీవే బాగా చేసావయ్యా కొత్త వాడివైనా అని భుజం తట్టి అభినందించారు మాచినేని వారంతా. ఆ నాటకం ప్రసారం అయిన తర్వాత మాకు మంచి పేరు వచ్చింది.
బందా గారు చేసిన మరో నాటకం ప్రణయంలో ప్రళయం దీనిలో ప్రధాన కథానాయకుడిగా నన్ను చేసి కథానాయికగా మచిలీపట్నం నుంచి వాణీ బాలను పిలిపించారు. నండూరి సుబ్బారావు గారితో కె వెంకటేశ్వరావు గారితో పెద్ద నటులందరితో నటించిన ఆమె సుబ్బారావు గారితో చాలా సహితంగా ఉంటుంది ఇద్దరూ ఏక వచన ప్రయోగం చేసుకునేంత చొరవ వుంది. నరసింహారావు గుంటూరులో మంచి రంగస్థల నటుడు మా అందరికీ బాగా పరిచయమైన వాడు అంతా కలిసి మూడు రోజులు కాల క్షేమం చేసి ఈ నాటకాన్ని విజయవంతం చేశాం. బందాగారికి చాలా ఆనందం కలిగింది తర్వాత రాయ జగపతి ఇది కూడా చారిత్రక నాటకమే దీనిలో ఏ విజయలక్ష్మి ని పిలిచి ప్రధానపాత్ర ఇచ్చాం. దీనిలో కోకా సంజీవ రావు కూడా నటించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి