ఆచరణీయం (3);--డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.

 పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఫాకల్టీస్ లో ఎలాంటి భవిష్యత్తు ఉంది ఏది చదవడం వల్ల తన బిడ్డ మంచి స్థితిలో ఎదుగుతాడు అని ఆలోచించలేరా తల్లిదండ్రులు  వాళ్లు ఆలోచించుకుంటున్న తరుణంలో ముసలివారు జోక్యం చేసుకొని  అరె అబ్బాయి తెలుగును మర్చిపోతే ఎలాగురా తెలుగు చదివించితే బాగుపడతావు. మన సంస్కృతి సంప్రదాయలు తెలుస్తాయి లేకపోతే  ఈ సమాజంలో వాణ్ణి వెలి వేస్తారు  అని చెబుతూ ఉంటే వారికి ఎలా ఉంటుంది  ఎవరు మాతృభాషను మర్చిపొమ్మని చెప్పరు కదా  తల్లిదండ్రులకు ఆ మాత్రం బాధ్యత ఉండదా ఇతర దేశాలలో ఉన్న వారు కూడా ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటూ బిడ్డల  భవిష్యత్తును ఆలోచించుకుంటూ ఉంటారు కదా  ఏం ముసలితనానికి ఆమాత్రం కూడా గుర్తు రాదా  ఇవాళ ఎన్ని విధాలైన విద్యా విధానాలు మన ముందుకు వచ్చాయో వారికి ఏం తెలుస్తుంది  ఎక్కడ ఏ గురువు ఎంత చక్కగా చెప్తాడో వారికి తెలుసా  అనవసరంగా ఎందుకు జోక్యం చేసుకోవడం.  మళ్లీ రభస ప్రారంభం ఆ స్థితి తెచ్చుకోవడం వారికి ఆ వయసులో అవసరమా  ఒక్కసారి వారంతట వారే పరిశీలన చేసుకుని ఆలోచించినట్లు అయితే ఇలాంటి అగచాట్లకు అవకాశం ఉండదు కదా. ఇంటికి వచ్చిన నూతన వధువును  సొంత బిడ్డలా చూసుకుంటారు. కొత్తగా వచ్చిన అల్లుని కూడా  తమ బిడ్డ లాగా చూసుకొని  అతనికి ఇచ్చిన గౌరవం  మర్యాదలను తనకు కూడా ఇస్తే  వీరి పట్ల అతని ప్రవర్తన ఎలా ఎంత మంచి అత్త మామ నాకు దొరికారు నాకు మరో తల్లి మరో తండ్రి దొరికినంత ఆనందంగా ఉంది అనుకొని వారికి కావలసిన విధంగా వారు అనుకున్న పద్ధతిలో ప్రవర్తించడానికి ప్రయత్నం చేయరా మనం ఎలా ఉంటే ఎదుటివారు కూడా అలాగే ఉంటారు అన్న ప్రాథమిక సత్యాన్ని తెలుసుకోలేక పోతే  ఎంత వయసు వచ్చినా  అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోలేదు వీరు అని మనకు అనిపిస్తుంది  కనుక నోటిని అదుపులో పెట్టుకొని  ఆ వయసులో ప్రవర్తన ఎలా ఉండాలో ఆ పద్ధతిలో వారు  నడవడికను తీర్చిదిద్దుకుంటే  వారి గౌరవాన్ని వారు కాపాడుకున్నట్టుగా ఉంటుంది  అన్నది నిత్య సత్యం.
సామాన్యంగా ముసలితనంలో  వారు అనుభవించిన  మంచి చెడు విషయాలను మననం చేసుకుంటూ  బిడ్డలకు  వాటిని వివరంగా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు  కానీ మారిన తరంతో పాటు  మనం కూడా మారితీరాలి  అన్న విషయాన్ని వారు మర్చిపోయి  మా రోజుల్లో అంటూ ప్రారంభిస్తే  ఎవరికి వినాలన్న కుతూహలం ఉంటుంది చెప్పండి  అందులోనూ చెప్పిన విషయాలే మళ్ళీ చూస్తూ ఉంటే  షేక్స్పియర్ అన్నట్లు  ఎ టేల్ టోల్డ్ బై యాన్ (a tale told by an idiot) ఇడియట్ ఆ  బుద్ధిలేని వాడు ఒకే కథ రెండోసారి కూడా చెప్తే ఎలా ఉంటుందో  అంత విసుగ్గా ఉంటుంది పిల్లలకు. కనుక ఆ వయసులో  వయసుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ  వారి గొప్పతనాన్ని డాంబికాన్ని కాని చెప్పడానికి ప్రయత్నం చేస్తే  ముందు తన గౌరవం పోతుంది అన్న విషయాన్ని గమనించి  దాని జోలికి వెళ్ళకుండా ఉంటే వారి గౌరవాన్ని వారు నిలబెట్టుకున్నట్టుగా ఉంటుంది.
కామెంట్‌లు