భారత గణతంత్ర దినోత్సవం !;-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ఇరువది ఆరవ జనవరి వచ్చింది
మరి మన మదికి ఆనందాన్నిచ్చింది
గణతంత్ర అమరులకు హారతి ఇచ్చింది
గానం చేసిన జనం స్వరగతిని మెచ్చింది.!

భారత గణతంత్ర దినోత్సవాన్ని గమనించి
భరతమాత పుత్రగణం అందర్ని
 ప్రోత్సహించి
ఐక్యమత్యంగా ఈ పర్వదినం జాతరను చేస్తారు
సఖ్యతతో జనమంతా ఒకటై ఇక చూస్తారు !

చెప్పుతారు వారు అందరికీ స్వాగతం
విప్పుతారు వారి యొక్క మనోగతం
విన్న జనం అంతా కలిసొస్తారు ఇక
కన్న కలలను నిజం చేస్తారు చక చక !

ప్రతి సంవత్సరం వచ్చేస్తుంటూనే ఉంటుంది ఇది
వ్రత ఉత్సవం చేయకుండా
 ఉండదు మన మది
భారత గణతంత్ర ఉత్సవాలకు ఉండదుగా పరిధి
స్వతంత్రించి చేయడమే మన అందరి విధి !

మన రాజ్యాంగం వచ్చినదే ఈ దినం
ప్రాథమిక హక్కులను పరిచయం చేసిన పర్వదినం
ముఖ్యమైన ఆరు హక్కులను అందించిన అమరదినం
సఖ్యతయై అందరూ మరువలేని స్మరణ దినం!

బ్రిటిష్ ప్రభుత్వం 1935 చట్టం ఐయింది రద్దు
భారత 1950 రాజ్యాంగ చట్టం కావడం ముద్దు
మన ప్రథమ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారు ఆపొద్దు
ప్రథమ గణతంత్ర దినోత్సవాన్ని ప్రారంభించుట మరువద్దు !

గణతంత్ర చారిత్రాత్మక అంశాలను గమనిద్దాం
పర తంత్ర ప్రహేళిక పరిణామాలను పరిశీలిద్దాం
ఈనాడు అంత కలిసిమెలిసి చేయి చేయి కలుపుదాం
హిమ శిఖరాలపై గణతంత్ర దినోత్సవ జండాను నిలుపుదాం!


కామెంట్‌లు