ఈ ప్రకృతిలో ఉన్న ఏ విషయాన్ని గమనించినా, దానిలో మంచి చెడు రెండు విషయాలు మనకు తెలుస్తాయి వీటిలో ఏది మంచి ఏది చెడు ఎవరైనా నిర్ణయించగలరా? ప్రకృతి నిర్ణయించిన ఈ శరీరంలో శరీరానికి ఆహారాన్ని ఇవ్వడం కోసం ఒక చేతిని శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మరొక చేతిని ఇచ్చాడు. కానీ భగవంతుని నమస్కరించాలంటే రెండు చేతులు కలిపి నమస్కరించక తప్పదు రెండో చేతిని ఎలా అనుమతించారు ఇది ప్రకృతి విరుద్ధమా కాదా మనిషి ఆలోచనా ధోరణిలో కూడా రెండు రకాలుగా ఒకదానికి మరొక దానికి సంబంధం లేని విధంగా ఆలోచిస్తాడు. ఏదైనా ఒక దానిని పొందడానికి మంచి మార్గము ఉంది చెడూ మార్గం ఉంది. దేనిని అనుసరించాలి అన్నదానిని మానవమస్తిష్కం నిర్ణయిస్తుంది. భారతదేశంలో భారతీయునిగా ప్రతి ఒక్కరికి భగవంతునిపై భక్తి ఉన్నది వారి శక్తిని ప్రతి ఒక్కరూ నమ్ముతారు ఆరాధిస్తారు ఆ భగవంతుని యొక్క శక్తి మనల్ని నడిపిస్తుంది మనతో మంచి చెడు పనులను చేయిస్తుంది అని పెద్దలందరూ అనుకుంటూ ఉంటారు ఎవరు ఎన్ని వ్యతిరేకార్థాలు తీసినా ఉన్న నిజం అది ఒక మనిషి ఏదైనా కార్యాన్ని తలపెట్టి దానిలో విజయాన్ని సాధించిన తర్వాత నా శక్తి యుక్తులతో దీనిని సాధించాను ప్రణాళికాబద్ధంగా నేను ఆలోచించి దానిని ఏ పద్ధతిలో సాధించాలో ఆ పద్ధతులను తెలుసుకొని దానిలో ఉత్తమమైన దానిని ఎన్నిక చేసి దాని ద్వారా నేను ఈ పని చేయగలిగాను అని స్రోత్కర్షలతో తనను తాను అభినందించుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది మానవ సహజ లక్షణం. పరిస్థితుల ప్రభావం వల్ల కానీ తను తీసుకున్న నిర్ణయం తప్పుది కానీ అయినప్పుడు ఆ కార్యం విఫలమవుతుంది అప్పుడు ఆ శక్తి జ్ఞాపకం వస్తుంది భగవంతుడు నన్ను కాచి రక్షించలేదు నా మీద కరుణించడం లేదు నేను చేసిన ఏ పని కలిసి రావడం లేదు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో అని అప్పుడు ఎంతో మధన పడుతూ బాధపడతాడు ఇది మానవుని వింత ప్రవర్తన కాదా దానిని చట్టబద్ధం చేశారు వేమన. మంచి చెడులు అన్నవి కర్మ ఫలాలు ఏ జన్మలో ఏది చేస్తే దానికి తగిన ఫలితం తర్వాతి జన్మలో వస్తుంది అని హిందువుల నమ్మకం వారి నమ్మకం ప్రకారం వేమన చెప్పిన అద్భుతమైన వాక్యం అది వారు రాసిన ఆటవెలదిలో స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పారు ఆ పద్యాన్ని మీరు కూడా చదివితే దానిని మీరు అంగీకరిస్తారు.
"చేటు వచ్చేనెని జెడనాడు దైవంబు
మేలు వచ్చేనేని మెచ్చుదన్ను చెడు మేలు దలప చేసిన కర్మముల్..."
"చేటు వచ్చేనెని జెడనాడు దైవంబు
మేలు వచ్చేనేని మెచ్చుదన్ను చెడు మేలు దలప చేసిన కర్మముల్..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి