వేద భూమిలో జన్మించిన మొదట విజ్ఞానాన్ని గురించి చెప్పినది వేదం. ప్రపంచ భాషలన్నిటిలోనూ అనువదించబడి ప్రచారాన్ని పొంది అనుసరణీయమైనది ఆ రోజున ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను జనభాషగా అనుసరించారు. తరువాత పాళీ భాష వచ్చిన తర్వాత బుద్ధుడు త్రి పిటకముల ద్వారా వేద సారాన్ని పాళీ భాషలో అనువదించారు. ఆ తర్వాత అన్ని భాషలకు పాకింది దానిని వేమన వేశ్యతో పోలుస్తున్నాడు. వేశ్య అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి కాదు ఐశ్వర్యానికి బానిస ఎవరో తనను ధనముతో తూయగలరో వారిని మాత్రమే వరించి వారితో గడిపి వారికి సుఖాలను అందిస్తుంది. అలాగే వేదము కూడా ఎవరికి అందుబాటులో ఉంటే వారు మాత్రమే దానిని ఆస్వాదించి అనుసరించగలరు. ఆ భాష రానివారికి ఆ వేదం ఎందుకూ పనికిరాదు. ఎన్నో భ్రమలను కలుగ చేస్తూ ఉంటుంది ఈ వేదం వేదములో ఉన్న ప్రతి స్తోత్రము అనుసరించదగినదే ఉదాహరణకు సత్యం వద సత్యమును మాత్రమే చెప్పుము అని చెబుతూ దానికే మళ్ళీ కొన్ని సందర్భాలను కల్పించి ప్రాణ, మాన హాని కలిగినప్పుడు అబద్ధం తప్పు కాదు అంటే ఎలా ఉంటుంది. వేదం ధర్మాలను చెప్పినది. ఆ ధర్మాన్ని అనుసరించే మార్గాలను మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది ఆ పద్ధతిలో వారు నడుస్తూ ఉంటారు. ఏ పద్ధతి ధర్మం ఏది అధర్మ పద్ధతి అన్నదానిని వారు నిర్ణయించుకోక అలా చేస్తున్నారా లేక అర్థం కాకనా, అంటే వాడు అర్థం చేసుకున్న పద్ధతి అదే కనుక ఆ మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు. ధర్మం తెలిసిన వారిలో ధర్మ సూక్ష్మాలను తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు. ఏ వాల్మీకి మహర్షి లాంటివారు లేదా వ్యాసులవారు మరి ఇంకెవరు ఉన్నారు. కనుక భిన్న మార్గాలు ప్రారంభమైనవి. ఆ భ్రమల నుంచి బయటపడి తన జీవిత మార్గాన్ని తాను ఏర్పాటు చేసుకోవడం కోసం తన మనస్సును స్వాధీనం చేసుకొని సమాజంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎలా ప్రవర్తించాలో నియమావళిని ఏర్పాటు చేసుకొని ఎన్ని కష్టనష్టాలు వచ్చినా దానిని అనుసరిస్తూ పోయిన వాడు ధర్మపరుడు గొప్ప విద్య తనకు తానుగా సంపాదించుకున్నది ఏదైతే ఉన్నదో దానిని అర్థం చేసుకుని మాత్రమే తన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడపమని జీవిత అనుభవాలతో కూడిన వేమన మనకు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. తాను నేర్చుకున్న గుప్త విద్యను కులకాంతతో అభి వర్ణించడంతో వేమన వ్యక్తిత్వం నిలిచింది. వారు రాసిన పద్యాన్ని చదవండి.
"వేద విద్య లెల్ల వేశ్యల వంటివి భ్రమల బెట్టి తేటపడగనీవు గుప్త విద్య యొకటి కులకాంత వంటిది..."
"వేద విద్య లెల్ల వేశ్యల వంటివి భ్రమల బెట్టి తేటపడగనీవు గుప్త విద్య యొకటి కులకాంత వంటిది..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి