హాస్యోక్తులు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నీతి సూత్రాలు అనే కాకుండా ధర్మ శాస్త్రాన్ని కూడా బోధించగలిగిన సత్తా కలిగిన వాడు వేమన. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు  రాజసంతో హుందాగా  అధికారాన్ని చెలాయిస్తున్న సమయంలో  అతనికి ఎదురుగా వెళ్లి మాట్లాడితే  అతని స్థానం ఏమిటి  మాట్లాడడమేమిటి? అందులోనూ హాస్యం ఆడినట్టుగా ఉంటే  రాజుగారు తప్పకుండా తన కత్తికి పని చెప్పడం జరుగుతుంది. కనుక జీవితంలో అధికారి పైన  ఎక్కువగా మాట్లాడడం తగ్గించు అని నీతి బోధ చేస్తున్నాడు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉంటుంది  ఒకరికి మాట మరొకరికి చేత ఇంకొకరు ఆయుధాన్ని చేతబట్టి దానితో అందరిని బెదిరిస్తూ తన అధికారాన్ని చూయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.  సహజంగా అతనికి అధికారం ఏమైనా ఉంటే  అలాంటి పనులు చేయడానికి అర్హుడే.
అది లేనప్పుడు అలా ప్రవర్తిస్తే  అతని పరిస్థితి ఏమిటి  ఏ హాస్యానికైనా  సమయం సందర్భం ఉంటుంది. తనకన్నా వయసులో చిన్న వారి మీద  ప్రయోగించే మాటల వర్షం వేరు  పెద్దవారితో మాట్లాడేటప్పుడు  కొంచెం భాషను ఆలోచించుకోవాలి  ప్రత్యేకించి ఆంధ్ర భాషలో ఉన్న విశేషం  ఒక అక్షరం అటు గాని ఇటు గాని జరిగితే దాని అర్థం పూర్తిగా మారిపోతుంది  ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాంటి వ్యతిరేకార్థం వచ్చినప్పుడు  అవతలివాడు బలవంతుడైతే ఇతని పరిస్థితి ఏమిటి  కనుక ఆయుధం ఉన్నంత మాత్రం చేత  ఇతరులను చులకనగా చూసి ఇష్టం వచ్చిన భాషను ఉపయోగిస్తే  దానికి తగిన ఫలితాన్ని వెంటనే అనుభవిస్తాం  కనుక జీవితంలో  బాధ్యతాయుతంగా ప్రవర్తించి తీరాలి అని చెప్తున్నాడు వేమన  ఇది అన్ని రకాల వ్యక్తులకు  సరిపోతుంది.
అలాగే మరొక ముఖ్యమైన  పదార్థం నిప్పు  మన పెద్ద వాళ్ళు చెప్పే మాట  నిప్పు జోలికి అప్పు జోలికి వెళ్ళకు  వెళితే జీవితం నాశనం అవుతుంది తప్ప ఏ మంచి జరగదు అని  అలాంటి అగ్నితో  సరసాలు అడగడం ఆటలాడడం చేసే  ఆటగాయి కుర్రవాళ్ళను  ఆ అగ్ని ఏం చేస్తుంది  మాటలతో చెప్పదు  దానికి మాటలు రావు కనుక  చేతలలో చూపిస్తుంది. ఆ క్షణానే ప్రాణాలను తీయగలదు  లేదా మంచాన పడ వేయగలదు  అలాగే ఇతరుల భార్యను  హాస్యోక్తులతో  అలరించాలి  అనుకున్న మూర్ఖుల మనసును  ఎలా అదుపు చేయాలో  ఆమె భర్తకు తెలుసు  కనుక ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దు ఈ నాలుగు పనులలో ఏది చేసినా ప్రాణానికి ముప్పు తప్ప  మెప్పు పొందలేరు అన్నది నిజం  అంటున్నాడు వేమన  ఆ పద్యాన్ని చదవండి ఒక్కసారి.

"తనదు నృపతి తోడ తన యాయుధముతోడ అగ్నితోడ పరుల యాలి చేత హాస్య మాడుటెల్ల ప్రాణాంతమే సమ్ము..."



కామెంట్‌లు