అమ్మ, అయ్య కూలికి పోయి !
ఇంటి పెద్దబిడ్డపై చెల్లెళ్ళ బాధ్యత పడితే....,
బడికి తాను పోలేక
మోయలేని ఇద్దరుచెల్లెళ్ళ బాధ్యత బరువే కదా !!
బడికెలా వెళ్ళాలి...
చదువెలా సాగేది...
తోటి పిల్లల జూసి...
కన్న కలలన్నీ కల్లలౌనా... !
ఆశలన్నీ పూసిపోవునా .. !!
పేదరికం శాపమా.... ?!
నీ ఆశలు - ఆశయాలు
నెరవేరగ... పట్టుదలతో...
వీలుచేసుకుని చదువును
సాగించుము చెల్లీ.....
కన్నకలలన్నీ నిజముచేసి
నువు విజయినివై ...
మహిళాలోకానికి ఆదర్శముగా
.నిలువుము తల్లీ... !!
********
చిత్రానికి కవిత ; - కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి