కిరణాల వెలుగుతో
కలిసి పయనిస్తాను
నింగిలోని మబ్బునై
రంగు నింపుకుంటాను
పచ్చదనపు వస్త్రమై
గిరిని చుట్టుకుంటాను
అవనిలో అణువణువూ
ఆవరించి చైతన్యమవుతాను.
ఆకు రాలు చోటులోనే
చిన్ని చివురునవుతాను
గాలికి సయ్యాటలాడేతీగలో
నవ్వేటి పువ్వునౌతాను
లోయలో వినిపించు
నిశ్శబ్దమై ప్రతిధ్వనిస్తాను
జలజలా జారేటి జలపాతమై
గిరుల మధ్యన సాగిపోతుంటాను
కిరణాల కుంచెతో శిఖరాలపై
బంగరు వర్ణాలు చిత్రిస్తాను.
ప్రకృతిలో అందాలకు పరవశించి
పరమాత్ముని కరుణకు ధన్యనౌతాను
ఉప్పెనంటి ఊహల ఉరకలతో
ఊపిరాడనివ్వని ఉదయానికి..
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి