తిశ్రగతి--రదీఫ్ :--నెలరాజా-- చంద్రకళ యలమర్తి
మధుమాసపు వెన్నెలలో వెలిగేవులె నెలరాజా
అందమైన తారలతో మురిసేవులె నెలరాజా

ఎగిసిపడే సంద్రానికిఎదురుచూపు ఫలియించెను 
పున్నమిలో వెలుగులతో మెరిసేవులె నెలరాజా

నీలికళ్ళసెలయటిలోమురిపెముగా మునిగినావు 
రెప్పలింట బందీగామిగిలేవులె నెలరాజా

నీకోసమె కలలుకన్న కలువలన్ని రేకువిప్పె
వలపుసెగకు మంచల్లే కరిగేవులె నెలరాజా 

నీరాకతొ అమావాస్య చీకటంత తొలగిపోయె 
నీతలపున రేయంతా గడిచేనులె నెలరాజా

**


కామెంట్‌లు