కొత్త ఎప్పుడూ ఆహ్వానించదగినదే.
పాత అనుభవాలు పటిష్ఠ పరుస్తుంటే,
అడుగులు ముందుకే పడాలి కదా!
ఆశలు,ఆశయాలు
చెట్టపట్టాలేసుకొని,
శ్రమ,విజయాలు
కూడబలుకుకొని,
పురోగమనమే కర్తవ్యం
కావాలి.
జ్ఞాపకాలు జ్ఞాపికలై నిలువకుండా,
హృదయాన్ని తట్టాలి.
మానవత్వం,దాతృత్వం
చెరగని చిరునామాలై
ఎప్పటికీ కనిపిస్తుండాలి.
కాలం అనుకూలమైనా,
ప్రతికూలమైనా,
పయనం మాత్రం
ఆగకూడదు మరి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి