దేవుడిపై నమ్మకం;-- యామిజాల జగదీశ్
 భక్తుడు : కృష్ణా! దేవుడి పట్ల నమ్మకం దేనికీ?
కృష్ణుడు : రేపు చెప్తాను.
మరుసటి రోజు....
కృష్ణుడు : మిత్రమా, గోవు మంచి జంతువా?
భక్తుడు : నువ్వడిగేది ఆశ్చర్యంగా ఉంది. ఆవు అనగానే నువ్వే జ్ఞాపకానికొస్తావు.  గోమాత పవిత్రమైనది.
కృష్ణుడు : నేనడిగిన దానికి జవాబివ్వ లేదుగా?
భక్తుడు : జంతువులలో విశిష్టమైనది గోవు. చాలా.
కృష్ణుడు : అలాగైతే ఆవుని ఇంకొకడెందుకు నడిపించడం? అదే తోలుకుపోవడం....?!తానే ఆ పని చేసుకుపోదా?
భక్తుడు : కృష్ణా! దానికి జ్ఞాపకశక్తి లేదుగా. ఎక్కడైనా దారి తప్పితే ఏం చేయాలి? అది సక్రమమైన దారిలో పోతోందో లేదో చూడటానికి ఓ కాపరి తప్పనిసరి.
కృష్ణుడు : నిన్న నువ్వు అడిగిన దానికి జవాబు ఇదే. నువ్వింకా అజ్ఞానంలో ఉన్నావు. తప్పు దారిలో పోతే ఏం చేయాలి? నిన్ను జ్ఞానమార్గంలో నన్ను చేరడానికి ఓ కాపరిగా నేనవసరమే కదా?!
ఇప్పుడు చెప్పు దేవుడిపట్ల నమ్మకం ఉండాలో వద్దో!
భక్తుడు : అద్భుతం కృష్ణా. నాకొక స్పష్టత వచ్చింది.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం