అతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆ అడవికి ఆనుకునే ఒక పల్లె ఉంది. కూలీనాలీచేసే ఒక బీదరైతు అడవికెళ్లి భూమిలోపల ఉన్న దుంపలు  తవ్వసాగాడు."ఏమయ్యోయ్! ఇన్నాళ్ళూ నాపైన ఒక్క నీటిబొట్టు కూడా చల్లలేదు.చుట్టూ తుప్పలు ముళ్ళు ఉన్నా శుభ్రం చేయలేదు. నన్ను తినాలని ఇప్పుడు తవ్వుతున్నావా? చాలు చాలు!నీదారిన పో" అరిచింది దుంప.రైతు అయోమయంగా చుట్టూ ఉన్న మేకలు గొర్రెలను చూశాడు. ఆకులు నముల్తూన్న మేకని అడిగాడు "ఏమంటున్నావు మేకా?" అది ఏమీ మాట్లాడలేదుకానీ కుక్క అంది" భూమిలోపల ఉన్న దుంప అంది.మేక కాదు." రైతుకి  కోపం వచ్చింది "ఏయ్ కుక్కా! నాకాళ్ళ దగ్గర పడి ఉండే నీవు నీతులు చెప్తావా?"అని చెట్టుకొమ్మ విరిచాడు కుక్కని కొట్టాలని! "ఏమోయ్! కుక్క ని కొట్టాలని నాకొమ్మని విరుస్తావా?" రైతు కోపంతో ఆకొమ్మను బండరాయి పై ఉంచాడు."నామీద నుంచి కొమ్మను తీసేయి" బండ అరుపుతో భయపడి పరుగులు పెట్టాడు. ఊరికి వెళ్లి  జరిగింది అంతా చెప్పాడు.వారు హేళనగా నవ్వుతూ"అబ్బ ఆపరా నీపిచ్చి సోది! భూమి పై కాస్త నీరు చల్లి మొక్కలు దుంపలు పెంచితే ఈబాధ మాట పడటం ఉండేది కాదుగదా? సోంబేరీ!అప్పనంగా అంతా తీసుకోవాలి అనే దురాశ పనికిరాదు " అని బుద్ధి చెప్పారు 🌷
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం