నూతనవత్సరాన ఓ బాలుడా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
బడికి రోజువెళ్ళుమురా
బహుబాగా చదువుమురా
బద్దకమును వీడుమురా
బడుద్దాయి కాకుమురా

బడాయిలకు పోకుమురా
బద్నామము కాకుమురా
బలముందని వీగకురా
బలహీనుల కావుమురా

బలేగ క్రీడలాడరా
బరిలోన దిగుచుండురా
బహుమతులను గెలువుమురా
బలేపేరు పొందుమురా


కామెంట్‌లు