స్వతంత్రాన్ని... గణతంత్రంగా రూపొందించి..., ప్రజలను...
ప్రజలే ప్రభువులై ఏలుకునే...
ప్రజాస్వామ్య విధానం... !
అంబేద్కర్ తొ సహా...
అభ్యుదయవాదులందరూ...
కలిసి రూపొందించుకున్న...
రాజ్యాంగం.... !!
ఐనా...మారని అధికారం తీరు
తెన్నులు... !
అబలలు, బలహీనులు...
అన్యాయాలకూ,దౌర్జన్యాలకు
బలైపోతున్నా... ఆదుకోలేని చట్టాలు - శాసనాలు... !!
అందరూసుఖపడతారనుకుంటే
అది కొందరికే సొంతం... !
పరాయి పీడను వదిలించు కున్నా ...సొంతచీడ... పీడలా పట్టి వదలకున్నది... !
ఎన్ని సవరణలు చేసినా....
ఏదో ఒకఅడ్డదారి,వెక్కిరిస్తూనే
వున్నది... !
అధర్మం గర్వంతో... కాలరెగరే స్తూనే వున్నది... !!
ఇన్నిన్ని సమస్యలతోసతమత
మైపోతుంటే...
గోతికాడినక్కల్లా...సరిహద్దుల్లో
.పొంచిఉన్న శత్రుమూకలు !
హఠాత్గావిరుచుకుపడుతున్న
వైరస్ లు.... !!
ఎన్నెన్ని సవాళ్లు... !
,ఓ... సర్వేశ్వరా.... !
వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కొని, ప్రజలకు సుఖశాంతులు కలిగే పాలనాసామర్ద్యాన్ని మా పాలకులకు దయతో ప్రసాదించి నీకృపావర్షమును
మా భారతావనిపై సమృద్ధిగా కురిపించుము తండ్రీ..... !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి