మదురై మీనాక్షి అమ్మవారి విశేషాలు;-- యామిజాల జగదీశ్
 * మీనాక్షి అమ్మవారి విగ్రహం మరకత మూర్తి. ఎందుకంటే అమ్మవారి మేను ఆకుపచ్చ వర్ణం.
 * అమ్మవారి కుడికాలు కాస్త ముందుకుంటుంది. ఎందుకంటే భక్తులు పిలిస్తే వెంటనే పరుగున రావడం కోసం.
 * అమ్మవారి చేతిలో ఉన్న చిలుక అమ్మవారి చెవిలో ఏదో చెప్తున్నట్లు ఉంటుంది. ఎందుకంటే చిలుక గుణమేమిటంటే చెప్పిన మాటను పొల్లుపోకుండా చెప్పడం! అలాగే భక్తుల మొరను మళ్ళీ మళ్ళీ అమ్మవారికి చెప్తున్నట్టు ఉంటుందా చిలుక. మన కోరికలు శీఘ్రమే నెరవేరుతాయన్న మాట.
* అమ్మవారి విగ్రహం స్వయంభువు. కొన్ని ఆలయాలలో లింగం స్వయంభువు. అయితే మదురైలో మీనాక్షి ఉగ్రపాండ్యన్పట్టాభిషేకం పిదప చొక్కనాథుడు పరమాత్మ సమీపంలో విగ్రహమై నిల్చుండిపోయారు. దాంతో స్వ
యంభువు అమ్మవారు. అమ్మవారు మదురైలో యాగశాలలో అగ్నిలో అవతరించారు. ఈమె పేరు తటాతక అంగయర్కణ్ణి
 
* పాండ్య మహారాజుకి మహారాణి కాంచనమాలకు ఒకే కూతురు. అందువల్ల పాండ్య రాజ్య మహారాణి అయ్యారు.
* ఇక్కడి గర్భగృహంలో అమ్మవారి విగ్రహం సజీవకళామూర్తి. ఓ స్త్రీని వీక్షిస్తున్నట్టే ఉంటుంది.
* అమ్మవారి విగ్రహాన్ని ఎల్లప్పుడూ చూసి తరించాలన్నట్టే ఉంటుంది.
* అమ్మవారి సన్నిధిలో మొగలిపువ్వు  కుంకుమను ప్రసాదంగా ఇస్తారు.
* మదురైలో అమ్మవారికే తొలి మర్యాద. ఇక్కడ తొలుత అంబికను దణ్ణం పెట్టుకోవాలి. అనంతరమే స్వామివారి దర్శనం.
* మీనాక్షి సుందరేశ్వరుడు నాడు నేడు ఎల్లప్పుడూ పాలిస్తున్నట్టు శివవాక్కు. 
* ఇక్కడి పరమాత్మ 64 శివలీలలతో కూడినది. మరే ఆలయంలోనూ ఇన్ని లీలలు లేవు.
* అన్ని శివాలయాలు ముక్తినిస్తాయి. కానీ ఇక్కడి శివాలయం సకల సంపదనిస్తుంది.
* మీనాక్షిసుందరేశ్వరుడు ఇక్కడ ఉండటంతోనే మదురైని సందర్శిస్తేనే ముక్తి పొందినట్లవుతుంది.
* ఇక్కడి ఆలయం అమ్మవారి నామంతో పిలువబడుతోంది. ప్రపంచంలోనే పెద్ద అమ్మవారి ఆలయమిది. శక్తిపీఠంకూడా.
* జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయం. తమిళ చిత్తిరై మాసులో అమ్మవారికీ తమిళ ఆవని మాసంలో స్వామివారికీ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
* ప్రత్యేకించి అందమైన గోపురాలు కలిగిన ఆలయం.
* తమిళనాట భారీ ఉత్సవాలు జరిగే తొలి ఆలయం మదురై మీనాక్షి అమ్మవారి ఆలయమే. శైవ, వైష్ణవాలు ఒక్కటిగా జరిపే ఉత్సవం.
* అమ్మవారి సోదరుడు మాయవన్ అయగర్ మళై అయగుమలయాన్. ప్రపంచవింతలలో ఒకటి అమ్మవారి ఆలయం.  ఆమెను వరణు వేడితే మనల్ని రక్షిస్తుంది.
 
* ఈ ఆలయం పశ్చిమ గోపురం (గోపురం) నమూనా ఆధారంగానే తమిళనాడు రాష్ట్ర చిహ్నం రూపొందించారు.
* మదురై మీనాక్షి సుందరేశ్వర్ ఆలయాన్ని
పాండ్య చక్రవర్తి సదయవర్మ కులశేఖర్  నిర్మించారు. ఆయన సుందరేశ్వర మందిరం ప్రవేశద్వారం వద్ద మూడు అంతస్థుల గోపురం ప్రధాన భాగాలను నిర్మించారు.  
* కులశేఖర పాండ్య కూడా ఒక కవి. ఆయన మీనాక్షిపై "అంబికై మలై" అనే పద్యం రాశారు. 
మదురై మీనాక్షి ఆలయానికి సంబంధించిన అనేకానేక విశేషాలలో ఇవి కొన్ని మాత్రమే.
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం