శబ్ద సంస్కృతి.! అచ్యుతుని రాజ్యశ్రీ

 గాజీ అనేది అరబ్బీ పదం.గజవా నించి వచ్చింది.దీని అర్థం ధర్మయుద్ధంఅని.తమమతంకోసం విధర్మీయులతోయుద్ధం చేసేవాడిని గాజీ అంటారు.వీరమరణం పొందితే షహీద్ అంటారు.షహీద్ కి స్వర్గం ప్రాప్తిస్తే గాజీకివైభవందక్కుతుంది.ఇస్లాంమతం స్వీకరించనివారిపై దాడిచేయడంజీహాద్ జేహాద్ అని కూడా అంటారు.పరాక్రమం ప్రదర్శించే సేనాని కి గాజీపదవి ఇస్తారు.ఇలాముస్లిం రాజులు మతవ్యాప్తి చేస్తూ గాజీలను పోషించారు
ఖరోష్ఠి అనేది ఒక లిపి.దీన్ని సృజించిన వ్యక్తి పెదాలు గాడిద పెదాలు లాగా ఉండేవి ట ‌.మధ్య ఆసియా లోఖరోష్ఠ అనే నగరం ఉండేది.దానిపేరుమీదుగాఆలిపికి ఆపేరు వచ్చింది అని కొందరి అభిప్రాయం.ఇరానీభాషలో ఖరపోష్ అంటే గాడిద చర్మం అని.అర్మేయిక్ భాషలో ఖరోద అంటే లిపి.బహుశ ఈఖరోడ్ సంస్కృతం లో ఖరోష్ఠ ఐనదేమో?క్రీ.శ.668లోచైనా గ్రంథాలలో ఖరోష్ఠిలిపి అనే పదం ఉంది.ఒంకరగాఉండేలిపి అది.
మౌర్య అనే శబ్దం మౌరెనించివచ్చింది.బౌద్ధగ్రంధాల్లో బుద్ధుడు ఈవంశంలోనే పుట్టాడని శాక్యవంశం దీనికి సంబంధించిన దే అని కొందరి అభిప్రాయం.చంద్రగుప్తునితండ్రి హిమాలయ ప్రాంతంలో ని చిన్న రాజ్యానికి అధిపతి.అక్కడ నెమళ్ళు ఉండటంతో మౌర్యులు వాటిని తినేవారు అని ముర అనే వనితకు పుట్టిన వాడు కావటంతో చంద్రగుప్త మౌర్య వంశ స్థాపకుడు ఐనాడని కథనం.
కామెంట్‌లు