: బీదలపాట్లు;-ఎం. వి. ఉమాదేవి *బాసర
నలుగురూ పనిచేస్తేే గానీ
నాలుగువేళ్ళూ నోట్లోకి పోని చోట.
ఆహార లోపంతో అనారోగ్యం
పొడుచుకు వచ్చే ఎముక ల్తో ..
 వేలాడేకండల యువత!
అడుగేస్తే తూలిపడే తల్లే
ఆ కుటుంబానికి ఆసరా!

వీరికి ఉచిత పథకాలనేవి
అందుకునే అర్హత లేదా?
 అసలు రేషన్ కార్డు లేదు
కార్యాలయం లో
గాందారిసిబ్బందికి వీరు
కనిపించరు, కనికరము రాదూ
ఎవరు యాచకులు?
అన్నీ ఉన్నా అక్రమంగా
పథకాలు దక్కించుకున్న
దురాశా పౌరులిక్కడే
ఉన్నంతకాలం వీరి దుస్థితి లో..,
మార్పు ఉండదు!

కామెంట్‌లు