ఆధ్యాత్మిక దేశం
భారతదేశం!
వ్యవసాయక దేశం
భారతదేశం!!
పారిశ్రామిక ప్రపంచంలో
ఆదిత్యుని దేశం
భారతదేశం!!!
మహత్యానికి మత్తుకు
కులం మతం మంత్రాలకు
చింతకాయలు రాలవు!!!
శ్రమకు చెమటకు మాటలుండవు
పని పాటలు మాత్రమే ఉంటాయి!!
అగ్రరాజ్యం అంటే ఆయుధాలేనా??
అగ్రరాజ్యం అంటే
అన్నం ఉన్న రాజ్యం కాదా !!?
అగ్రరాజ్యం అంటే అన్నీ ఉన్న రాజ్యమేనా!?
ప్రపంచానికి
అన్నం పండించే రాజ్యం కాదా!!!?
సహజ వనరులనే కాదు
ప్రపంచానికి
మానవ వనరులిచ్చిన
అందరూ మెచ్చిన దేశం
మా దేశం భారతదేశం అదే అగ్రరాజ్యం!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి