గగనాన ఎగిరే పతాకం
గణతంత్ర దేశంగా శిఖరాగ్రం
తంత్ర మంత్రాలతో పనిలేని
కుతంత్రాలెరుగని వందే భారతం!
భిన్న జాతులు మతాలు కులాలు భాషలున్నా
రంగుల హరివిల్లు అని
జగపతికిచ్చు సందేశం!
చరిత్రలో వైశాలి వెలిసే తొలి ప్రజారాజ్యం గా
జగతిలో గ్రీస్ తొలి గణరాజ్యంగా సత్తా చాటే
సర్వసత్తాక సామ్యవాద లౌకిక
ప్రజాస్వామ్య దేశం గా
అతిపెద్ద లిఖిత రాజ్యాంగం తో
భరతమాత సత్తా చూపేను
రాజుల తరాజుల పాలన చెల్లిపోయే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజల ప్రాధమిక హక్కులకి భరోసా
శాసన కార్యనిర్వాహక న్యాయ శాఖల సంగమం!
ఓటు ఆయుధం అంకుశంగా
ప్రజలే ప్రభువులు ఈనాడు
ప్రజలచేత ప్రజల కోసం
ప్రజలద్వారా అందరికోసం
సర్వేజనా:సుఖినోభవంతు
తొలి రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్
తొలి ప్రధాని నెహ్రూ
తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్
సారధ్యంలో చకచకపరుగులు తీసే భారత గణతంత్ర రధం
ఉపన్యాసాలు ఉత్తుత్తి వాగ్దానాలు
ఒకరిపై ఒకరు చల్లకుండా బురద
కారాలుమిరియాలు నూరకుండా శరీరాలు వేరైనా
మాఆత్మ ప్రాణం ఒక్కటే అనే భావం ఉంటే?
స్వార్ధం సంకుచితత్వం వీడితే
హమారాభారత్ మహాన్
హమ్ సబ్ ఏక్ హై నినాదం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి