కందం:
*జ్ఞానుల చరితము వీనుల*
*నానుచు సత్పరుష గోష్ఠి ననఘంబనుచున్*
*బూనుము; ధర్మపథంబును*
*దా నెరిగినయంత; మరువదగదు కుమారా !*
తా:
కుమారా! మంచి వారి జీవిత చరిత్రలను చెవులకు, మనసుకు ఆనందము కలిగించేదిగా తెలుసుకునొము. మంచి వారితో స్నేహం చేస్తూ, వారితో మంచి మంచి చర్చలలో పాల్గొనడం ద్వారా పాపాలు నశిస్తాయి అని తెలుసుకో. ఇలా తెలుసుకున్న మంచి మార్గాన్ని మరచిపోయి కూడా విడిచి పెట్టకు..... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*పరీక్షిత్తు చాలా మంచి రాజు. ధర్మ మార్గంలోనే నడచుకొనే వాడు. కానీ, అనాలోచితంగా జరిగిన పాప కర్మ నుండి తప్పించుకోవడానికి భాగవత పురాణం వినడం మొదలుపెడతాడు, ఋషులు, మునులు,పురోహితులు చెప్పడం వల్ల. ఇవాళ మనకి, ఒక రామకృష్ణ పరమహంస, వివేకానందులు, పరమహంస యోగానంద, కందుకూరి వీరేశలింగం పంతులు గారు వంటి మహానుభావులు, పుణ్యచరితుల చరత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటిని, మనం, ఇప్పటి యువత చేత చదివించ గలిగితే వారి చక్కని ఎదుగుదలకు సహకరించిన వారము అవుతాము. అటువంటి మంచి అవకాశాన్ని పరమేశ్వరుడు మనకు ఇవ్వాలని..... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి