గీతా తత్త్వం (13);-డా.నీలం స్వాతి,చిన్నచెరుకూరు గ్రామం,
గీతా సిద్ధాంతం ఏమిటంటే  తత్వ పరిశీలన జ్ఞానము లేకుండా  కేవలం కర్మ చేయడం మీదనే ఆధారపడిన  భౌతిక సంపత్తిని అభివృద్ధి చేయడం  మాత్రమే జీవిత పరమావతి అనుకోవడం పశుత్వం  అవుతుంది. అలాగే భౌతిక సంపత్తితో సంబంధం లేని  కేవలం తత్వజ్ఞానంతోనే ఆత్మశాంతి లభిస్తుంది అనుకోవడం కూడా గుడ్డి నమ్మకం అని నిరూపించబడింది అంటే ఆహార విహారాదులకు సంబంధించిన భౌతిక సంపత్తి లోపించినట్లయితే  అభ్యుదయము అంటే దేహ ఆరోగ్యం నిలపవచ్చును.  అలాగే తత్వ పరిశీలన జ్ఞానము  లోపించినట్లయితే  నిశ్శ్రేయము అంటే హృదయానికి కావలసిన శాంతి లభించటం జరుగదు  దీనిని బట్టి గీతాకారుడు జ్ఞాన శూన్యమైన కార్యకలాపములను అంగీకరించలేదని  అలాగే కర్మ త్యాగముతో కూడిన తత్వజ్ఞానం కూడా  వారు అంగీకరించలేదు అని స్పష్టంగా మనకు తెలుస్తోంది  అయితే ఆయన కోరేది ఏమిటి  ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అదే. జ్ఞాన కర్మల సమన్వయము ఆత్మ  విశ్వముల సంమిశ్రమము  జ్ఞాన విజ్ఞానముల ఏకీకరణ  అందువల్లనే గీతాకారుడు జ్ఞాన విజ్ఞాన సహితం అని  జ్ఞాన విజ్ఞాన తృప్తత్మా అని  ప్రబోధించేటప్పుడు మాటిమాటికి ఎలుగెత్తి సాటివాడు  దీనిని బట్టి జ్ఞాన విజ్ఞానములను సమన్వయం చేసి ఆచరణలో పెట్టగలిగినప్పుడే మానవులకు  సుఖశాంతులు లభించగలవు అని గీతాకారుడు  స్పష్టంగా చెప్పాడు అని తెలుస్తోంది  కనుక జ్ఞానము విజ్ఞానము అంటే ఏమిటి  దాని గురించి వివరంగా తెలుసుకుందాం.  గీతా వ్యాఖ్యన కర్తలలో జ్ఞాన విజ్ఞానములు అనునవి పర్యాయపదములుగా ఉదాహరించిన వారు అనేకులు ఉన్నారు  అలాంటి గీతా సహాయంతో గీతాకారుని దివ్య అభిప్రాయాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించడం అంటే ఎండమావుల్లో దాహాన్ని తీర్చుకోవాలని  కోరుకోవడమే.
ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే  జ్ఞానము విజ్ఞానము అనే మాటలను గీతాకారుడు అనేకసార్లు ప్రయోగించారు  అనేక అర్థాలలో కూడా. ఫిజిక్స్ కు అంటే పదార్థ విజ్ఞాన శాస్త్రానికి, కెమిస్ట్రీకి రసాయన శాస్త్రానికి  ఫిలాసఫీకి తత్వ శాస్త్రానికి సైన్సు కు అంటే విజ్ఞాన శాస్త్రానికి  థియోరిటి కల్  టెక్నాలజీకి సైధంతిక జ్ఞానానికి ప్రాక్టికల్ నాలెడ్జి కి అనుభవ జ్ఞానానికి  తటస్థమునకు వ్యవహారమునకు ఏ భేదము ఉండదో ఆ వేదమే జ్ఞాన విజ్ఞానములకును కలదు అని  వస్తువు యొక్క గుణ స్వభావము ఇలాంటిది అని తెలియజేయడం  జ్ఞానము అని  ఆ వస్తువులు ఉపయోగించడం ద్వారా పొందే అనుభూతిని విజ్ఞానం మరియు  చెప్పుచున్నారని గీతాకారుని నిర్వచనం  అంటే పాటలు పాడుట యొక్క విధానం ఎరుగుటను  జ్ఞాన మన బడునును ఆ పాటను పాడుట ద్వారా పొందిన అనుభూతిని విజ్ఞానము అని పిలుస్తాడని దీని సారాంశం.కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం