తెలుగుభాష మనదని వెలుగెత్తి చాటరా
మాట మాట కలపటానికి అనువైన వేళ ఇదేరా
తెలుగు వెలుగులు ప్రపంచానికందించగ
కడలి తరంగంలా కదిలి రండి
// తెలుగు//
మాటైనా పాటైనా
మాతృ భాష లోనే
అక్షరమైనా పదమైనా
ఆలాపన తెలుగులోనే
సరిగమల సరాగమే మన భాష సొగసురా
తేనె కన్నా తీయనిది మన వాక్కని
లోకానికి ఈ రీతిగ చాటాలి
// తెలుగు//
కష్టమనే రాయి తగలగానే
"అమ్మా!" అని పిలుస్తాం తలుస్తాం
ఏదైనా చెప్పాలనిపించగానే
పెదవి విప్పుతాం
అది వాణైనా బాణైనా తెలుగులోనే
మరో భాష మనకొద్దని నినదిద్దాం
మన తెనుగే ముద్దని తీర్మానిద్దాం
// తెలుగు//
మాట మాట కలపటానికి అనువైన వేళ ఇదేరా
తెలుగు వెలుగులు ప్రపంచానికందించగ
కడలి తరంగంలా కదిలి రండి
// తెలుగు//
మాటైనా పాటైనా
మాతృ భాష లోనే
అక్షరమైనా పదమైనా
ఆలాపన తెలుగులోనే
సరిగమల సరాగమే మన భాష సొగసురా
తేనె కన్నా తీయనిది మన వాక్కని
లోకానికి ఈ రీతిగ చాటాలి
// తెలుగు//
కష్టమనే రాయి తగలగానే
"అమ్మా!" అని పిలుస్తాం తలుస్తాం
ఏదైనా చెప్పాలనిపించగానే
పెదవి విప్పుతాం
అది వాణైనా బాణైనా తెలుగులోనే
మరో భాష మనకొద్దని నినదిద్దాం
మన తెనుగే ముద్దని తీర్మానిద్దాం
// తెలుగు//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి