మూర్ఖ మనసు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 ఈ ప్రపంచంలో మనుషులందరూ  జన్మించినప్పుడు జ్ఞానముతోనే  తల్లి గర్భం నుంచి  ఈ భూమి మీదకు వస్తారు వయస్సు పెరుగుతున్న కొలది  జ్ఞానం పరి పరి విధాల పని చేస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని  తన కంటితో చూసిన దీని వెనక ఎలాంటి మోసంఉన్నదో  అని అనుమాన పడుతూనే ఉంటాడు. చాలామంది వ్యక్తులలో మనకు కనిపిస్తున్న సాధారణ విషయం  వారికి  వారి మీదనే పూర్తి నమ్మకం ఉండదు. దీనిలో రెండు రకాలు  బుద్ధి మంచి పనుల మీద  దృష్టి పెట్టి ఇతరులకు సహాయంగా ఉండేట్టుగా  ఉండేవి కొందరి మనస్తత్వం  కొందరి తత్వాలు జీవితంలో ఎన్ని అనుభవాలు జరిగినా  ఏ విషయాన్ని గురించీ  తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయని చేయడం  ఇలాంటివారు మూర్ఖులు అని పిలవబడతారు. కొంతమందిలో  కొన్ని మూఢ అభిప్రాయాలు  ఉంటాయి  ఎంతమంది ఎలా ఎన్ని ఉదాహరణలతో చెప్పిన వినడు  తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని వాదిస్తాడు  దానికి తగినట్లు దానికి వ్యాఖ్యానం కూడా చేస్తాడు. ఏ కుందేలుకైనా నాలుగు కాళ్లు ఉంటాయి  ఒక కాలు నేను పట్టుకున్నాను కనుక  మిగిలినది మూడు కాళ్లేగా  కనుక నేను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్ళు  అని వాదించే  తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి కూపస్థమండూకం  లాగా జీవితాన్ని గడుపుతూ  ఒక కప్ప నూతిలో నివసిస్తూ  జీవితం అంటే ఇదే ఇలాగే ఉంటుంది  అనుకుంటుంది తప్ప  దాని జన్మలో ఎప్పుడు చెరువును, నదిని, సముద్రాన్ని చూసిన పాపాన పోదు  ఈ మనిషి కూడా ఆ కప్పతో పోల్చదగినవాడే  తినడం తిరగడం ఆనందించడం తప్ప ఈ జీవితానికి మరి ఏం కావాలి అని  ఆలోచించడు.
మనిషికి కావలసినది  భౌతిక వాంచాలు మాత్రమే కాదు  ఈ శరీరం ద్వారా సాధించవలసినది ఏదైతే ఉన్నదో  ఆ మోక్షాన్ని సాధించడం కోసం  వనాలను ఎన్నిక చేసి  ఆ ప్రశాంత వాతావరణంలో  మనసును  తన స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ  భగవంతునిలో లీనం కావడానికి ప్రయత్నం చేస్తాడు  మానవుడు మనస్ఫూర్తిగా  దీనిని సాధించాలి అని ప్రయత్నం చేసినప్పుడు  తప్పకుండా విజయాన్ని పొందుతారు  మోక్ష ప్రాప్తి కలుగుతుంది  ఈ మూర్ఖుడు  తన ఎదురుగా బ్రహ్మ కానీ విష్ణువు గాని ప్రత్యక్షమై  కనిపిస్తూ నడుస్తున్న  వాడిని గుర్తించే స్థితిలో ఉండటం  వారు కూడా తనలాంటి వ్యక్తి అని భావించి  అసలు ఆ విషయాన్ని గురించి ఆలోచించడమే మానేస్తాడు  అందుకే అతను  వివేకవంతుల నుంచి దూరంగా ఉంటాడు  అని విశదా పరుస్తున్నాడు ఏమని  ఆ పద్యాన్ని ఒక్కసారి చదవండి మీకు తెలుస్తుంది.
"పర్వత వనవాసి  పరిణామ  వర్తన గూపవాసికెట్లు గురుతుపడును  
బ్రహ్మ విష్ణు వెంట  
ప్రాకృతుడడుగునా..."


.

కామెంట్‌లు