చింత లేని జీవితం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ భూమి మీద ఏ మనిషి సుఖవంతంగా బ్రతికిన దాఖలాలు లేవు. ఎన్ని ఆస్తి పాస్తులున్న ఇంకా కావాలని  ఆశ పడుతూనే ఉంటాడు. తనకు ఏది వున్న దానితో తృప్తి చెందాక  అనేక రకాల కోరికలతో  మనసు చికాకు పడుతూనే ఉంటుంది  అతి చిన్న బీద కుటుంబం నుంచి  అతి పెద్ద కోటీశ్వరుల వరకు ఇది తప్పని మానసిక  ఆలోచన. విపరీతమైన ఆస్తి సంపాదించి  దానితో తృప్తి పడక  ఇంకా ఇంకా సంపాదించాలని  రకరకాల ఆలోచనలతో రకరకాల  వ్యాపారాలలో డబ్బు మదుపు పెట్టి సంపాదన పై ఉన్న ఆశతో  ఎంతో పెరగాలనుకుంటాడు. ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను పెట్టింది నీ ఆదాయం ఎంత అయితే దానిలో కొంత ప్రభుత్వానికి కట్టాలి  నీవు అంత సంపాదించడానికి కారణం  ప్రభుత్వం నీకు ఏర్పాటు చేసిన వనరులు  కనుక దానికి రుసుం చెల్లించాలి  అంటుంది. ఎంతో కష్టపడి  ఎన్నెన్నో ఆలోచనలతో  ఇంత ధనాన్ని సమకూర్చుకున్న వాడికి  తమ చేతులారా ప్రభుత్వానికి  డబ్బు కట్టవలసిన వస్తే  మనసు అంగీకరించదు  దానితో వక్ర మార్గాలు వెతికి  దొంగ లెక్కలు చూపి  తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు  ఎత్తుకు పై ఎత్తులు వేసే ప్రభుత్వ ఊరుకుంటుందా  ఇతని కన్న ఎక్కువ  ఆలోచించగలిగిన మేధావులు ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు  ఈ నల్లధనాన్ని బయటకు ఎలా లాగాలో వారికి చాలా బాగా తెలుసు  దానితో వారు  వారి ప్రయోగంతో  ఇతని రహస్యాన్ని బట్టబయలు చేస్తే  తాను కట్టవలసిన  రుసుముతో పాటు  పెనాల్టీతోక సహా కట్టవలసి  వస్తుంది  దానితో మానసిక వేదనకు బలవుతాడు  ఇలాంటి కష్టాలు చేతులారా చేసుకున్నవి. ఇలాంటివి కాకుండా  విధి వంచితులు చాలామంది ఉంటారు  వారందరికీ మానసిక బాధ తప్పకుండా ఉంటుంది. దానివల్ల ఎన్నెన్నో ఆలోచనలు  చేయవలసినవి, చేయకూడనివి  తమ మనసులోకి వచ్చి  కకా వికలంచేస్తూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి  అలా కాకుండా మనిషి  ఆశలను వదిలివేసి  నిజాయితీగా జీవితాన్ని కొనసాగిస్తూ  తాను ఏది చేయాలని అనుకుంటాడో దానిని  ధర్మ మార్గంలో చేస్తూ వెళుతూ ఉన్నవాడికి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో  ఆ భగవంతునికే తెలుసు  అందుకే వేమన మనకు  ఆటవెలది ద్వారా ఒక హెచ్చరిక చేస్తున్నాడు.  చేతులారా కొని తెచ్చుకునే  కష్టాల జోలికి వెళ్ళకండి  చింతలు లేని జీవితం  ప్రశాంతతనిస్తున్నది దానికి అలవాటు పడండి అని చెప్తున్నాడు  ఆ పద్యాన్ని చదవండి.

"ఎంత కష్టముండునంత పాపపు చింత 
చింతచేత మిగుల జీవుడు మనసు 
చింతలేఖనున్న చెడని సంపద జూచు..."



కామెంట్‌లు