కౄర జంతువు రౌద్రంతో రగిలిపోతున్నా.... లక్ష్యపెట్టక
చోద్యం చూస్తున్న మర్కటం !
మరింత క్రోధం తో గాండ్రి స్తున్న పులి !
చాల్లే నీబడాయి... !నీ అరుపులకిక్కడ భయపడేవారెవ్వరూ లేరిక్కడ
నీకు పరుగులుతీసి పంజావిసిరే శక్తి ఉంటే..., నాకు క్షణాలలో కొమ్మనుంచి కొమ్మకు గంతులేస్తూ తప్పించుకునే యుక్తి ఉ ఉంది.. !
నాయుక్తిముందు నీ ఆటలేవీ పనిచేయవు... !!పో... పో....
పోయి నీ పనిచూసుకో....
నీవు వ్యాఘ్రాని వైతే... నేను
సముద్రాన్నే లంఘించి, లంకా
దహనం చేసిన హనుమకు వారసుడ్ని.... !
అంటున్నట్టు నిర్లక్ష్యంగా...
తొణుకూ బెణుకూ లేకుండా
నిశ్చలంగా కూచుంది....
వానరం..... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి