సంభాషణ మాధుర్యం-;- తాటి కోల పద్మావతి


=ఆకాశంలో ప్రయాణం చేస్తున్నా ఒక హంసకు కొన్ని కొంగలు ఎదురైనాయి. అవి హంసను నిలదీస్తున్నట్లుగా ప్రశ్నలు వేస్తున్నాయి. హంస సహనంతో సమాధానం ఇస్తూ ఉంది. ఎలాగో చూడండి-

ప్రశ్న: ఎవడ ఓరి కాళ్లు మొగ మెర్రన?

సమాధానం: హంసను.

ప్రశ్న: యందు నుందువో?

సమాధానం: దవ్వుల మానసంబునను.

ప్రశ్న: దాన విశేషములేమీ తెలుపుమా?

సమాధానం: మవ్వపు కాంచనాభ్యములు మౌక్తికముల్ గల వందు.

ప్రశ్న: నత్తలో?

సమాధానం: అవి ఎరుంగము.

ఇంతకు మాటల్లా కనిపించే పై ప్రశ్నలు, సమాధానాలు నిజానికి ఒక చాటుపద్యంలోనివి. సుమండీ. చూడండి.

లోకంలో తమకు తెలిసిందే గొప్పది అనుకుంటారు కొందరు. వారు ఎదుటి వాళ్లలో ఎంత గొప్ప విలువ ఉన్నా లెక్క చేయరు. పై పెచ్చు హేళన చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. మానస సరోవరంలో నివసిస్తూ, తామర తూడులు ఆహారంగా తీసుకునే హంస ఎక్కడ?

నత్తలు తినే కొంగ ఎక్కడ? కానీ హంస తనకు నత్తలేమిటో తెలియదనగానే కొంగలన్నీ విరగబడి నవ్వినాయి. తొలుత పలకరించేటప్పుడు కూడా'ఏరా? ఎర్రమూతోడా? అనే వెటకారంగా పిలిచాయి. పాలను నీటిని వేరు చేసే హంస లాంటి గుణవంతులైన వారిని మనం ఆటపట్టించాం అనుకోకూడదు. జ్ఞానుల్ని గౌరవించడం మన భారతీయ సనాతన సంప్రదాయం. చక్కని నీతిని పక్షుల ద్వారా చెప్పిన కవితా మాధుర్యం ఇక్కడ కనిపిస్తుంది.


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం