దైవబలం; - కొప్పరపు తాయారు

  మనకు అస్త్రం అన్నా  బాణం అన్నా ఒకటే. కానీ గురువు వద్ద, గురువు విద్య నేర్చుకునే ప్రతి (విద్యార్థి), అప్పుడు శిష్యులు పద్ధతిగా నేర్చుకునేవారు. గురువు నీడలో ,గురు అండతో గురువు యొక్క బోధనతో, నేర్చుకుని మంచి విద్యా పారంగతుడు అయ్యేవాడు శిష్యుడు.
     అందుకే సంపూర్ణులు వారి విచక్షణ జ్ఞానం కూడా ఎక్కువే.
     బాణం అంటాం కదా దానికి ఏ శక్తి ఉండదు కానీ అదే అస్త్రం అని అదే భాణాన్ని మంత్రంతో ప్రయోగిస్తే మహాస్త్రం అవుతుంది. అందుకే వాటికి "నామాలు" కూడా వచ్చేయ్. ఉదాహరణకి, బ్రహ్మాస్త్రం వారుణా స్త్రం ఇత్యాది....
                ఈ అస్త్రం ప్రయోగించినప్పుడు మంత్రం ఉంటే కానీ బలం ఉండదు అందుకు ఆ మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపం చేస్తారు అలా జపం చేసిన మంత్రాన్ని మనం ఉపయోగించినప్పుడు చెప్పి ప్రయోగిస్తే ఆ భాణం ఆ మంత్ర ప్రభావం వల్ల పనిచేస్తుంది. అందుకే అది మహాస్త్రమైంది.
          కర్ణుడు యుద్ధ భూమిలో సాత్యకితో ఒక్క అస్త్రాన్ని కూడా ప్రయోగించలేకపోతున్నాను అని బాధపడ్డాడు. అప్పుడు సాత్యకి నీకుస్పూర్తి లేదు ,
స్పురణకు రావటం లేదు అని.అంటే దైవానుగ్రహం లేక అని అర్థం.
          అంచేత మనం ఎంత నేర్చుకున్నా మనకి భగవంతునిపై నమ్మకం పెట్టుకోవాలి. అది లేకపోతే ఏ పని కూడా విజయవంతం కాదు.
కామెంట్‌లు