ఒక ధనవంతుడు తన కొడుకుకి పేదరికమంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని ఓ గ్రామంలో ఉన్న అతి సామాన్యుడి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ రెండు మూడు రోజులు ఉండి అనంతరం తన ఇంటికి చేరుకున్నాడు.
పల్లెలో ఓ పేదవాడు ఎలా జీవిస్తున్నాడో చెప్పమని అడగ్గా ధనవంతుడి కొడుకిలా చెప్పాడు...
"నాన్నా నాన్నా, మన ఇంట్లో ఒక్క కుక్కే ఉంది. ఆ గ్రామంలో పది పదిహేను కుక్కలున్నాయి.
మన తోటలో ఒకటి రెండు దీపాలే ఉన్నాయి. ఆ గ్రామంలో లెక్కలేనన్ని నక్షత్రాలు మెరుస్తున్నాయి.
మన ఇంట్లో ఉన్న వరండా పెద్దదే. కానీ వారి ఇంటి ముందు సువిశాలమైన వరండా ఉంది.
మనం ఒకరోజు పాతబడిన పాలు తాగుతున్నాం. వాళ్ళు అప్పటికప్పుడు తాజా తాజా పాలు పిండుకుని తాగుతున్నారు.
మనం వాడిన కాయగూరలు తింటుంటాం. వాళ్ళు మొక్కలలో కాసిన కాయగూరలు అప్పటికప్పుడు కోసుకుని తింటున్నారు.
మన ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టుకుని దాని లోపలే భద్రంగా ఉన్నట్టు అనుకుని బతుకుతున్నాం.
కానీ ఆ గ్రామస్తులకు ఊరే రక్షణ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు.
కొడుకు జవాబుకి తండ్రి ఆశ్చర్యపోయాడు. విస్తుపోయాడు.
అంతేకాదు, నిజమైన పేదవాడెవడోనని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ తండ్రి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి