న్యాయాలు -54
గర్త జంబుక న్యాయము
********
గర్త అంటే గుంట లేదా గొయ్యి అని అర్థం. జంబుకం అంటే నక్క .
జంతువులలో నక్కకు మంచి పేరు లేదు. కుటిలత్వం మోసకారి తనానికి , అవకాశవాదానికి ప్రతీకగా చెబుతారు.
దీని గుణాలను, ప్రవర్తనను బాగా గమనించిన పెద్దలు అది చేసే పనులను గుంట నక్క చేష్టలు అంటారు.
అది ఎక్కువగా గోతుల దగ్గర కాచుకుని ఉంటుంది. అవకాశం,అదును చూసి గోతిలో పూడ్చిన శవాన్ని పీక్కుని తింటుంది.అందుకే నక్కను జిత్తులమారిదనీ , అది ఎరుగని బొక్కలు అంటే జంతువుల ఎముకలు ఉండవనీ, నక్క చేయని దుష్ట పనులు ఉండవనీ అంటారు.
చిన్నయ సూరి రాసిన పంచ తంత్ర కథల్లో నక్క గురించి చాలా కథలు ఉన్నాయి. అడవికి రాజైన సింహంతో కలిసి తిరుగుతూ ఉండటం.ఇతర జంతువులపై చాడీలు చెప్పి వాటిని చంపిస్తుందని విన్నాం.ఆహారం గురించి ఎలాంటి శ్రమ పడదనీ, సింహం వేటాడి తినగా మిగిల్చిన ఆహారాన్ని తింటుందని చదువుకున్నాం.
అందుకే నక్క గురించి తలుచుకోగానే ఇవన్నీ కళ్ళ ముందు మెదులుతాయి.
అలాంటి దుష్ట బుద్ధి, జిత్తులమారితనం కలిగి, చెడు పనులు చేసే వారి చేష్టలకు ఉదాహరణగా ఈ గర్త జంబుక న్యాయమును చెబుతుంటారు.
ప్రస్తుత సమాజంలో ఇలాంటి వారు కొందరు కనిపిస్తూ ఉంటారు. వీరికి నిలువెల్ల స్వార్థమే ఉంటుంది.
ఇతరులపై చాడీలు చెప్పి పబ్బం గడుపుకునే వారూ,మనిషి పోయి ఒకరేడుస్తూ వుంటే అతని మరణాన్ని రాజకీయం చేసి లబ్థి పొందాలని ప్రయత్నించే వారూ, అవకాశం కోసం ఎదురు చూస్తూ తమ ఉన్నతికి ఎంతకైనా తెగించే వారూ కనిపిస్తూ ఉంటారు.
ఇలాంటి వారిని చూసినప్పుడు మనకు ఈ గర్త జంబుక న్యాయము వెంటనే గుర్తుకు రావడం పరిపాటి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి