రుచేక మహర్షి, సత్యవతుల పుత్రుడు జమదగ్ని మహర్షి. రుచే కునే తపః ప్రభావం చేత రెండు యజ్ఞ ప్రసాదములు సృష్టించబడి ఆ ప్రసాదముల ప్రభావం చేత సత్యవతిని జమదగ్ని, సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు పుట్టారు. జమదగ్ని భార్య రేణుక. జమదగ్ని రేణుకల పుత్రుడు పరశురాముడు. జమదగ్నిని కర్తవీర్యార్జునుడు తపస్సులో ఉండగా సంహరించాడు. కానీ బృగు మహర్షి తపః ప్రభావం చేత ఆయన పునర్జీవుడు అయ్యాడు. పరశురాముడు ఈ కారణం చేత కార్త వీర్యార్జునితో పోరి అతనిని సంహరించాడు. ఆ కక్షతోనే కార్త వీర్యార్జుని పుత్రులు జమదగ్ని హోమ గృహంలోనే సంహరించారు. ఆ సమయంలో'పరశురామ నీ తండ్రిని రక్షించు"అని 21 సార్లు రేణుకాదేవి రోదించినది. అందుకోసమే పరశురాముడు 21 సార్లు భూమి మొత్తం తిరిగి క్షత్రియ సంహారం చేశారు. జమదగ్ని సప్తర్షులలో ఒకరు.
ఋషులు-జమదగ్ని మహర్షి.;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి