హిమాలయాల్లో ఉన్న రూప్ కుండ్ సరస్సుని గూర్చి తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ చేపలబదులు నరకంకాళాలు కన్పడతాయి.అందుకే దాన్ని అస్థిపంజరాల సరస్సు అంటారు. ఉత్తరాఖండ్ లోఉన్న గ్లేషియర్ ఇది.మంచు కరిగిన సమయంలో దీన్ని 1942 లోఒక గేమ్ రిజర్వు రేంజర్ కనుగొన్నాడు.ఆ కంకాళాలు జపాన్ సైనికులవి అని అనుమానించారు. కానీ రిసెర్చ్ వల్ల తెల్సిన దేమంటే అవి చాలా పురాతన కంకాళాలు.ఈసరసు దగ్గరగా
నందాదేవి ఆలయం ఉంది. ఓరాజు రాణి సపరివారంగాదేవీ దర్శనానికి బైలు దేరారు.అమ్మవారు ఆగ్రహించటంతో పిడుగులు పడి అంతా చనిపోయారు. ఆకంకాళాలు మంచు కరిగినప్పుడు సరసులో కన్పడ్తాయి.దాదాపు 800 అస్థిపంజరాలున్నాయి.మే ఆఖరువారంలో సెప్టెంబర్ అక్టోబర్ మధ్య రూపకుండ్ కి వెళ్లవచ్చు. దీనికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఋషికేశ్.ఎన్నో బస్సులు వెల్తాయి.మే నెల ప్రారంభంలో ట్రెక్కింగ్ కి చాలా మంది వెల్తారు.మన ఇండియా లోనే అద్భుత అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫారిన్ వెళ్లనవసరం లేదు. అంత వెరైటీ ప్రాంతాలు శీతోష్ణస్థితులు రకరకాల పక్షులు వన్యప్రాణులున్న హమారా భారత్ మహాన్ 🌺
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి