అమ్మ పద గేయం;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
కాంతి దీపం అమ్మ
శాంతి వాసం అమ్మ 
కల్లోల జగతిలో
కరుణ రూపం అమ్మ

త్యాగమూర్తే అమ్మ
భువిని స్పూర్తే అమ్మ
కుటుంబ క్షేత్రంలో
కామధేనువు అమ్మ

అమ్మ లేక జగతి
అవుతుంది అధోగతి
కొడగట్టిన దీపం
తరచి చూడగ ప్రగతి

అమ్మ ఉన్న కళకళ
తారల్లా మిలమిల
సదనమే స్వర్గము
సెలయేరుల గలగల


కామెంట్‌లు