గృహాలంకరణ.;- తాటి కోల పద్మావతి గుంటూరు


 పండుగలు రాగానే ఇంటి ముందు మామిడి తోరణాలు కడతారు. మధ్యలో పూలదండలతో, మొగలిపూల రేకులతో సరాలు దించుతారు. ఉగాదినాడు మామిడాకు, వేపమండల్ని కడతారు. అలాగే శ్రీరామనవమి ఉత్సవాల్లో చలువ పందిళ్ళు వేస్తారు. శివ భక్తులు శివరాత్రికి ప్రభలు కట్టుకొని, సంగీత నృత్యాలతో బయలుదేరుతారు. కావడినే కట్టుకొని, కావి రంగు బట్టలతో చిందులేస్తారు. ఊరు మొత్తం బంతిపూల దండలతో, మామిడి తోరణాలతో, అలంకరిస్తారు. ఈ అలంకరణ కూడా మన సంప్రదాయ శోభలో భాగమే! ఇదేవిధంగా పెళ్లి మంటపాన్ని, హోమ కుండాలను కూడా అలంకరిస్తారు. హిందూమతంలోని ఆకర్షణ రంగురంగులుగా చేసే ఈ అలంకరణమే, అనే పాశ్చార్యులు అబ్బుర పోతుంటారు. పండుగ అంటే ఇల్లు కడిగి శుభ్రం చేసి అందంగా ముగ్గులు పెట్టుకోవడం. ఆ పండుగ సాంప్రదాయాన్ని ఇంటిల్లిపాది కలసి ఆనందంగా చేసుకోవడం. కుటుంబ సభ్యులంతా గృహాన్ని అందంగా పండుగ సందర్భాన్ని బట్టి అలంకరించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఈనాటికీ మనం ఆ సంప్రదాయాన్ని వదులుకోకుండా పాటించడం మన అందరి కర్తవ్యం.


కామెంట్‌లు