🦜 నమస్తే సర్ శుభోదయం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో 💐 🦜🦜
===========================================================
న్యాయాలు -52
గత జల సేతు బంధన న్యాయము
*******
గత/గతం అంటే అయిపోయిన లేదా గతమైన అని అర్థం. జల/ జలం అంటే నీళ్లు. సేతువు అంటే,గట్టు,కట్ట,వంతెన అని అర్థం.బంధనం అంటే బంధించడం లేదా కట్టడం అని అర్థం.
గత జల సేతు బంధనం అంటే నీళ్లు గతమయ్యాకా అంటే పోయిన తరువాత అడ్డుకట్ట కట్టడం అని అర్థం.
అంటే వర్షాలు వచ్చినప్పుడు వాటిని నిల్వ చేసుకోవాలి ఉపయోగించు కోవాలి అనుకున్నప్పుడు ఆ నీళ్ళు వృధాగా పోకుండా అడ్డుకట్ట వేయాలి. జలాశయాలు అన్నీ అడ్డుకట్టలు వేసి నీళ్ళను నిల్వ చేసినవే.
అలా నీళ్ళను పొందే సమయంలో కాకుండా తర్వాత అడ్డుకట్ట వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా!.
దానినే మన నిత్య జీవితానికి అన్వయించుకోవచ్చు. జరిగిపోయిన విషయాలను గురించి ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని వాపోతూ ఉండటం సహజం. కానీ అలా బాధ పడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నిర్ణయాలు కానీ ,పనులు కానీ సకాలంలో చేస్తే ఫలితం దక్కేది. అంతే కానీ ఆ సమయం మన నుండి చేజారిన తర్వాత ఎంత గింజుకున్నా,బాధ పడినా గతాన్ని వెనక్కి తీసుకుని రాలేము.
ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నో సార్లు ఎదురవుతుంటాయి.
ఎవరినైనా కలవాలని అనుకున్న వారిని కలవక పోవడం.చేయాలనుకున్నవి చేయకపోవడం. ఏవైనా అపోహలు, పొరపాట్లు ఉంటే తక్షణమే సరిచేసుకోక పోవడం...ఇలా వాటి కలిగిన నష్టాలను, కష్టాలను, బాధలను, వైఫల్యాలను తలుచుకుని కుమిలి పోవడం జరుగుతుంది.
దీని వల్ల మానసిక వేదనే మిగులుతుంది తప్ప ఒరిగేదేమీ లేదు.
అందుకే పెద్దలు, అనుభవజ్ఞులు అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు, తమ అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇలా "గత జల సేతు బంధనం న్యాయాన్ని ఉదాహరణగా చెబుతుంటారు.
అలా భవిష్యత్తులో చేయకండని ఓదారుస్తూ ఉంటారు, హితవైన మాటలతో హెచ్చరిస్తూ కూడా ఉంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి