అక్షరాలు ఉన్నది ఎందుకురా
పుటలపై వ్రాసే టందుకురా!
పుటలపై వ్రాసే దెందుకురా
చక్కగ చదివే టందుకురా!
చదువులు నేర్చే దెందుకురా
విఙ్ఞానం పొందే టందుకురా!
విఙ్ఞానం పొందే దెందుకురా
ఉద్యోగాలు చేసే టందుకురా!
ఉద్యోగాలు చేసే దెందుకురా
జీతాలు సంపాదించే టందుకురా!
జీతాలు పొందే దెందుకురా
పెళ్ళి చేసుకునే టందుకురా!
పెళ్ళి చేసుకునే దెందుకురా
కాపురం చేసే టందుకురా!
కాపురం చేసే దెందుకురా
పిల్లాపాపలు కనే టందుకురా!
పిల్లలని కనే దెందుకురా
పోషించి పెద్దచేసే టందుకురా!
పిల్లలను పెంచే దెందుకురా
వంశాన్ని నిలిపే టందుకురా!
వంశాన్ని నిలిపే దెందుకురా
పేరుప్రఖ్యాతులు పొందే టందుకురా!
కీర్తిప్రతిష్ఠలు పొందే దెందుకురా
శాశ్వతచరిత్రలో నిలిచే టందుకురా!
శాశ్వతచరిత్రలో నిలిచే దెందుకురా
జీవితాన్నిసఫలం చేసుకునే టందుకురా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి