కందం:
*కత్తిని చేతం బట్టుచు*
*మొత్తదలచి వచ్చువాని ముఖ్యముగా మే*
*ల్హత్తించిన సదె ప్రాయ*
*శ్చిత్తమని జంపదగదు చిన్ని కుమారా !*
తా:
కుమారా! కత్తి చేతిలో పట్టుకుని, మనల్ని చంపాలి అని వచ్చే వారిని, మనం చంపకుండా వదిలి పెట్టడమే, మనల్ని చంపడానకి వచ్చిన వానికి చేసే సహాయం. దీనివల్ల అతను ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంటుంది. ........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*పాడవులను, దుర్యోధనుడు మాయా జూదంలో ఓడించిన తరువాత, దుర్యోధనుడు ప్రవర్తించిన తీరు వల్ల భీమసేనుడు దుర్యోధనుని మీదకు వెళుతున్నప్పుడు, యుధిష్టరుడు భీముని ఆపి, ఇది సందర్భం కాదు, ఆగమని చెపుతాడు. అలాగే, 12 నెలల అజ్ఞాతవాసం చేసేటప్పుడు, సైరంధ్రి గా ఉన్న ద్రౌపదిని కీచకుడు చెర పట్టాలి అని ప్రయత్నించాడు, అప్పుడు కూడా వలలుడుగా ఉన్న భీమసేనుని వారిస్తాడు, కంకుభట్టు అయిన ధర్మరాజు. ఈ రెండు సందర్భాలలో కూడా సందర్భానుసారంగా మాత్రమే మన స్పందన ఉండాలి. కానీ, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. నిజానికి, ఈ రెండు సార్లు, అవతలి వైరి వర్గానికి తమ ప్రవర్తన మార్చుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. అయితే, వారు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోలేదు. అందువలన, వారు కాలగతిలో, వారి ప్రవర్తనకు తగిన ఫలితాన్ని అనుభవించారు. కాబట్టి, మన చుట్టూ ఉన్న వారు అందరూ, ఎదుటి వారి వైరాన్ని, ప్రయత్న పూర్వకంగా క్షమించగలిగే మనసు ప్రసాదించమని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి