ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (36);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
కోటిరెడ్డి మంచితనం వల్ల  ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న  రైతులందరి  అభిమానాన్ని పొందగలిగాడు  వారి వల్ల కూడా కొన్ని వ్యాపార విషయాలు తెలియడం వల్ల తన జీవితంలో చాలా మంచి జరిగింది  ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో చౌకగా వచ్చే పొలాలను  వాటిని సక్రమంగా సాగు చేయగలిగితే  కొంతకాలం జరిగిన తర్వాత  అది పిల్లలకు పనికొస్తుంది  వారు పనిచేయడానికి వీలు లేక అమ్ముకున్న  వీరు పెట్టిన ఖర్చుకు మరింత లాభాలు వచ్చి వారి భవిష్యత్తు బాగుపడడానికి ఉపయోగపడుతుంది  అన్న అభిప్రాయంతో  తన స్నేహితుల వల్ల ఆ పరిసర ప్రాంతాలలో  తనకు అనుకూలంగా ఉన్న పొలాలను  కొనడం వల్ల  మంచి లాభాలను పొందడానికి అవకాశం వచ్చింది. దానివల్ల జీవితంలో ఆర్థికంగా  నిలదొక్కుకున్నాడు.
పెళ్లి కావడానికి పూర్వం  విసన్నపేటలో ఉంటున్న సమయంలోనే  సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను  ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది  తాను ఎక్కడ ఉంటే తన స్నేహబంధం  తన చుట్టూ వస్తారు ఎక్కడ ఉన్నా  ఎప్పుడు సందడిగానే ఉంటుంది. వారందరితోను  సంప్రదించి  ఆ పరిసర ప్రాంతాలలో  ప్రదర్శించి మంచి పేరు సంపాదించిన నాటకాలను  తన గ్రామానికి ఆహ్వానించి  అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేసేవాడు  ఆ పరిసర ప్రాంతాలలో అంతకుముందు ఎప్పుడు  ఇలా జరగకపోవడం వల్ల  ప్రేక్షకులలో ఉత్కంఠ పెరిగి
కుటుంబాలతో సహా ఆ కార్యక్రమాలకు వచ్చేవాడు  దానితో  వారికే కాకుండా  ఆ ప్రదర్శించినప్పుడు ఉండాలని కూడా ఎంతో సంతోషంగా ఉండేది  అలా చాలా మంచి కార్యక్రమం  ఏర్పాటు చేసుకున్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టన మేస్తుందా అని మన రైతులు చెప్పే సామెత అలా తన శక్తికి మించి చేస్తున్న పనిని చూసి  కుమారుడు వరుణ్ కూడా  ఆ కార్యక్రమాలలో భాగం పంచుకున్నాడు  పొలాల్లోనే చిన్న ఇల్లు కట్టుకొని  ఖాళీ స్థలం ఎక్కువగా ఉంచి  జామ చెట్టు, మామిడి చెట్టు,  చింత చెట్టు,  బొప్పాయి చెట్టు  కరివేపాకు చెట్టు,  పెట్టి  ఇంటికి సరిపడిన వాటిని వుంచి మిగిలిన వాటిని ఇరుగు పొరుగు వారికి పంచి  వారందరిలోనూ  మంచి పేరు సంపాదించుకున్నారు.దానితో వారిలో కొంతమంది  మనం మాత్రం ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు అంటూ వారు కూడా ఉపయోగకరమైన చెట్లను పెంచి  వారు వ్యాపార దృష్టితో  డబ్బులు సంపాదిస్తున్నారు.

కామెంట్‌లు